Advertisementt

విజయ్ దేవరకొండకు లక్కీ ఛాన్స్

Sun 17th Mar 2024 05:50 PM
family star  విజయ్ దేవరకొండకు లక్కీ ఛాన్స్
Lucky chance for Vijay Deverakonda విజయ్ దేవరకొండకు లక్కీ ఛాన్స్
Advertisement
Ads by CJ

లైగర్ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ గ్రాఫ్ బాగా పడిపోయింది. పూరి జగన్నాథ్ తో లైగర్ చిత్రంతో ప్యాన్ ఇండియా హిట్ కొడదామని కలలు కన్న విజయ్ దేవరకొండని ఆ చిత్రం పూర్తిగా డిస్పాయింట్ చేసింది. లైగర్ డిసాస్టర్ నుంచి కోలుకోవడానికి విజయ్ కి చాలా సమయమే పట్టింది. ప్రస్తుతం పరశురామ్ దర్శత్వంలో ఫ్యామిలిస్టార్ చిత్రం చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చెందుకు రెడీ అయ్యాడు. రీసెంట్ గానే ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ని ఫినిష్ చేసిన టీం ప్రస్తుతం ప్రమోషన్స్ జోరు మొదలు పెట్టింది.

ఏప్రిల్ 5 ఫ్యామిలీస్టార్ తర్వాత మళ్ళీ మంచి సినిమా, పేరున్న సినిమా ఏదీ థియేటర్స్ లోకి రావడం లేదు. ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ ఇలా వరస పండగ సెలవలు కాదు.. ఎలక్షన్స్ కారణంగా ఏప్రిల్ లో ఏ సినిమా విడుదలకి మొగ్గు చూపలేదు. తీరా ఎలక్షన్స్ ఇప్పుడు మే కి వెళ్లడంతో ఏప్రిల్ నెల మొత్తం ఫ్యామిలీస్టార్ దే హవా అయ్యేలా కనబడుతుంది. విజయ్ దేవరకొండ సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా  ఫ్యామిలీస్టార్ రెండు మూడు వారాలు థియేటర్స్ లో దున్నేస్తుంది.

స్టూడెంట్స్ హాలిడేస్ తో అల్లాడుతున్నారు. థియేటర్స్ కి పోదామంటే సినిమాల్లేవు. మొత్తానికి ఫ్యామిలీస్టార్ ఆప్షన్ తప్ప మరేదీ లేదు. దీనిని బట్టి విజయ్ దేవరకొండ లక్కీ కాకపోతే ఇంకేమిటి. 

Lucky chance for Vijay Deverakonda:

Family Star releasing worldwide on April 5th

Tags:   FAMILY STAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ