కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెపుకోవక్కర్లేదు. సౌత్ టాప్ హీరోయిన్ లో నయనతార ముందుంటుంది. స్టార్ హీరోలే కాదు, మీడియా రేంజ్, చిన్న హీరోల అవకాశాలను వదలదు, అంతేకాకుండా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చేస్తూ నయనతార ఇప్పటికి ఫుల్ బిజీనే. పెళ్లయ్యింది.. అయినా అమ్మడుకి ఆఫర్స్ ఆగడం లేదు. రీసెంట్ గా నయన్ హిందీలోకి ఎంట్రీ ఇచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. జవాన్ తో నయనతార క్రేజ్ హిందీలో బాగా పెరిగింది.
ఇక నయనతార సోషల్ మీడియాకి దూరంగా ఉన్నట్టుగానే వాణిజ్య ప్రకటనలు దూరంగా ఉండేది. కానీ కొద్దిరోజుల క్రితమే రెండు మూడు ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కొన్ని ప్రొడక్ట్స్ కి సైన్ చేసిన నయన్ అందుకు సంబందించిన యాడ్ షూట్స్ చేసింది. తాజాగా టాటా స్కై యాడ్ షూట్, అలాగే మాంగో జ్యుస్ యాడ్ షూట్ చేసిన నయనతార 50 సెకన్ల యాడ్ కోసం అక్షరాలా 5 కోట్లు అందుకుంది అనే న్యూస్ కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అది విన్న చాలామంది షాకవుతున్నారు.
కేవలం 50 సెకన్ల నిడివి గల యాడ్ కోసం నయన్ ఐదు కోట్లు అందుకోవడం ఆమె రేంజ్ ని తెలియజేస్తుంది అని, ఇది నయనతార క్రేజ్ అంటూ ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు.