పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబో అనగానే గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హరీష్ శంకర్ తో మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి చాలా తక్కువ మేర షూటింగ్ జరిగింది. గత ఏడాది మార్చి లో ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఉస్తాద్ సందడి కనిపించలేదు. హరీష్ శంకర్ కూడా పవన్ వలన టైమ్ వేస్ట్ అవ్వకూడదని రవితేజ తో కలిసి మిస్టర్ బచ్చన్ మూవీ మొదలు పెట్టుకున్నాడు.
అయితే సడన్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అప్ డేట్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవర్ ఫుల్ టీజర్ రెడీ అవుతుంది.. పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ కి ఉపయోగపడేలా టీజర్ ని డిజైన్ చేస్తున్నారంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. ఇదేమి రూమర్ కాదు.. అది నిజమే. మార్చ్ 19 న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి స్పెషల్ టీజర్ అప్ డేట్ ఉండబోతున్నట్టుగా మైత్రి మూవీస్ వారు ప్రటించారు.
అది పవర్ ఫుల్ ఫుల్ డైలాగ్ టీజర్ అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెబుతుండగా.. హరీష్ శంకర్ ప్రక్కనే ఉండి చూసుకుంటున్న పిక్స్ ని షేర్ చేసారు. Expect the unexpected 😎 19th March ❤️🔥❤️🔥❤️🔥 అంటూ పవన్ కళ్యణ్ డబ్బింగ్ చెబుతున్న పిక్స్ ని మైత్రి వారు షేర్ చేసారు. మరి మార్చ్ 19 న సోషల్ మీడియా షేక్ అవడమే కాదు.. ప్రతి పక్షాల గుండెలు గుబులు పుట్టించేలా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఉండబోతున్నాయని పవన్ ఫాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.