ఎట్టకేలకు హనుమాన్ అభిమానుల ఎదురుచూపులకు తెర పడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ హనుమాన్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది జనవరి 12న నలుగురు స్టార్ హీరోలతో పోటీ పడుతూ విడుదలైన హనుమాన్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని మరీ రికార్డ్ స్థాయిలో వసూళ్లతో అదరగొట్టిన ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ పై చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
సంక్రాంతి బరిలో విడుదలైన చిత్రాలన్నీ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ హనుమాన్ మాత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని కనీసం ప్రకటించలేదు కూడా. దీంతో ఈమూవీ స్ట్రీమింగ్ అప్డేట్ కావాలంటూ నెట్టింట నెటిజెన్స్ గోల చేశారు. హనుమాన్ డిజిటల్ హక్కులు దక్కించుకున్న జీ 5 కూడా ఓటీటీ డేట్ పై ఎలాంటి సమాచారం లేకుండా ప్రేక్షకులని వెయిట్ చేయించడంతో ఇంట్రెస్ట్ పోయిందంటూ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు సైలెంట్ గా హనుమాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
హనుమాన్ హిందీ వెర్షన్ మార్చి 16 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక తెలుగు అలాగే ఇతర భాషల్ల హనుమాన్ ఓటీటీ పై ఇంకా ఎడతెగని సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది అనుకుంటే.. ఇప్పుడు సడన్ గా తెలుగు ప్రేక్షకులకు సంభ్రమాశ్చరంలో ముంచెత్తేలా చేసింది. తెలుగు రైట్స్ ను జీ 5 కొనుగోలు చేసిన సంగతి విదితమే. జీ 5 హనుమాన్ చిత్రం స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించింది సదరు ఓటీటీ సంస్థ. శనివారం రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతోన్నట్లు తెలుస్తోంది. హనుమాన్ హిందీ వర్షన్ హక్కులను జియో కొనుగోలు చేసింది. అలాగే కలర్స్ సినీ ప్లెక్స్ ఛానల్లోనూ హనుమాన్ టెలికాస్ట్ అయ్యింది. ఒకేసారి టెలివిజన్, ఓటీటీలో ప్రసారమైంది ఈ చిత్రం.