ఏపీలో ఎలక్షన్స్ హడావిడి మొదలవుతుంది.. సినిమాలు రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ రావని చాలామంది హీరోలు భయపడ్డారు. అందుకే ఏ హీరో కూడా మార్చ్, ఏప్రిల్ ఈ రెండు నెలల్లో సినిమాలు రిలీజ్ చెయ్యడానికి ముందుకు రాలేదు. ఎలక్షన్స్ అంటే పాలిటికల్ మీటింగ్స్, ప్రచారాలు అంటూ తెగ హడావిడి చేస్తారు. ఎలక్షన్స్ వస్తున్నాయని స్టూడెంట్స్ కి ముందుగానే ఎగ్జామ్స్ పెట్టేసారు. ప్రస్తుతం వాళ్ళు పరీక్షలు రాసి ఖాళీగా ఉన్నారు. సినిమాలు చూద్దామంటే మంచి సినిమానే థియేటర్స్ లో లేవు.
కానీ ఇప్పుడు చూస్తే ఎలక్షన్స్ మే కి వెళ్లిపోయాయి. దానితో ప్రేక్షకులు డిస్పాయింట్ అవుతున్నారు. ఏప్రిల్ 5 న ఫ్యామిలీ స్టార్ వస్తే ఆ తర్వాత మరో సినిమా లేదు. మే 9 న కల్కి చిత్రం రావాల్సి ఉంది. కానీ ఆ వెంటనే మే 13 న ఎలక్షన్స్ జరుగుతాయి. దానితో కల్కి 2898AD కూడా పోస్ట్ పోన్ అవ్వడం గ్యారెంటీగా కనబడుతుంది. గత రెండు నెలలుగా పెద్ద సినిమాలు లేవు, మరో రెండు నెలలు కూడా పెద్ద సినిమాలు లేవు. హాలిడేస్ లో బోర్ కొట్టేస్తుంది.
ఇప్పుడు చిన్న సినిమాలు విడుదలై ఏ మాత్రం టాక్ బావున్నా కలెక్షన్స్ కుమ్మేస్తాయి. కాని ఆయమన్న సినిమానే లేదు. ఎలక్షన్స్ చూస్తే మే నెల్లో ఉన్నాయి. ఈ మధ్యలో మీడియం బడ్జెట్ సినిమాలు ఎమన్నా రిలీజ్ అయినా ఓకె.. మరి అలా ఎవరైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.