Advertisementt

పవన్ ఉస్తాద్ నుంచి పవర్ ఫుల్ టీజర్ ?

Sat 16th Mar 2024 10:06 PM
ustaad bhagat singh  పవన్ ఉస్తాద్ నుంచి పవర్ ఫుల్ టీజర్ ?
Powerful teaser from Pawan Ustaad Bhagat Singh? పవన్ ఉస్తాద్ నుంచి పవర్ ఫుల్ టీజర్ ?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కి బ్రేకిచ్చారు. డిసెంబర్ నుంచి పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ లో కన్నా రాజకీయాలతోనే బిజీ అయ్యారు. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ OG చిత్ర షూటింగ్స్ కి పూర్తిగా బ్రేకిచ్చిన పవన్ కళ్యాణ్ ఇటు టీడీపీ తో పాటుగా బీజేపీ లతో పొత్తు కోసం చర్చలు జరుపుతూ త్యాగాలు చేస్తూ ఫైనల్ గా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుతో ఏపీ ఎలక్షన్స్ లో పోటీకి సిద్ధమయ్యారు. దానితో హరీష్ శంకర్ ఉస్తాద్ ని పక్కనబెట్టి రవితేజతో మిస్టర్ బచ్చన్ షూటింగ్ చేసుకుంటుంటే.. సుజిత్ నానితో సినిమా ప్రకటించాడు.

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ని మొదలు పెట్టిన కొద్దిరోజుల్లోనే దర్శకుడు హరీష్ శంకర్ పవర్ ఫుల్ గ్లిమ్ప్స్ వదిలి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసాడు. ఇప్పుడు మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ తో ఓ టీజర్ కట్ చేసారని దానిని ఎలక్షన్స్ ముందు వదిలేందుకు హరీష్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ పార్ట్ లో పవన్.. పోలీస్ పాత్రలో ప్రభుత్వంపై వేసిన కొన్ని కౌంటర్ డైలాగ్స్ ఉన్నాయట. వాటితో ఒక డైలాగ్ టీజర్ కట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. 

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చే టీజర్.. పవన్ రాజకీయాలకు మంచి బూస్టప్ ఇవ్వనుందని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు పార్టీలని కలుపుకుపోతూ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. పిఠాపురం నుంచి పోటీ చెయ్యబోయే పవన్ కళ్యాణ్ కి ఈ ఉస్తాద్ టీజర్ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి ఎందులో ఎంత నిజముందో అనేది మాత్రం మేకర్స్ ఇచ్చే అప్ డేట్ ని బట్టి తెలుస్తుంది. 

Powerful teaser from Pawan Ustaad Bhagat Singh?:

Powerful Dialogue Teaser from Ustaad Bhagat Singh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ