హీరోయిన్ సమంత రీ-ఎంట్రీ కోసంఎదురు చూస్తుంది. అందుకు తగిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్, బయట ఇంటర్వ్యూలు అంటూ అందరిని తనవైపే చూసేలా చేస్తుంది. గ్లామర్ షో చెయ్యడానికి ఎప్పుడూ వెనకాడని సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆ గ్లామర్ షో ని మరింతగా పెంచేసింది, పుష్ప చిత్రంలో ఓఊ అంటావా మావా సాంగ్ తో సెన్సేషన్ కి తెర లేపింది.
ఇక తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ షో పిక్స్ వదలడంతో సమంత అవకాశాల కోసమే ఇలాంటి ఫోటో షూట్స్ వదులుతుంది అని మట్లాడుకుటనున్నారు. ఈ మాటలపై సమంత ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యింది. అందాల ఆరబోత విషయం తనకు ఎప్పుడూ ఇబ్బంది కలిగించే విషయమే అన్నట్లుగా చెప్పుకొచ్చింది. పుష్ప సినిమాలో ఊ అంటావా పాట కోసం స్కిన్ షో చేసిన విషయమై ఆమె స్పందిస్తూ... నాకు అలాంటి ఔట్ ఫిట్స్ తో ఇబ్బందే. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు తప్పడం లేదు అన్నట్లుగా చెప్పింది.
అలా గ్లామర్ గా కనిపించడం నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కష్టమే. కానీ సినిమా కోసం, ప్రేక్షకుల కోసం, అభిమానుల కోసం అన్నట్లుగా తాను అలాంటి ఔట్ ఫిట్స్ తో కనిపించాను అన్నట్లుగా సమంత చెప్పిన తీరు చూస్తే అది నాకూ ఇబ్బందే కానీ తప్పట్లేదు అన్నట్టుగా ఉంది కదా!