దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ముందుగా అనుకున్నట్లే మార్చి-16న షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. తొలి దశలో పోలింగ్ ఏప్రిల్-19న జరగనుంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. నాలుగో విడతలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్.. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మే-13న ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాలకు.. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే ఏడు దశల్లో జరిగిన ఎన్నికలకు జూన్-04న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
రాజీవ్ కుమార్ మీడియా మీట్‌లో ముఖ్యాంశాలు..
ఇక.. దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు
55 లక్షల ఈవీఎంలను వినియోగిస్తున్నాం
ఎన్నికల ప్రక్రియలో కోటీ 50 లక్షల మంది సిబ్బంది
ఎలాంటి లోపం లేకుండా ఎన్నికలు జరపాలనేదే ఈసీ ప్రయత్నం
జూన్ 16లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం
ఓటర్లు ఎంతమంది..?
దేశంలో మొత్తం ఓటర్లు 96.8 కోట్లు
పురుష ఓటర్లు 49.7 కోట్లు, మహిళా ఓటర్లు 47.1 కోట్లు
కోటి 85 లక్షల మంది కొత్త ఓటర్లు
దేశవ్యాప్తంగా 48 వేలమంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు
88.4 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు
12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువ
ప్రతి 1000 మంది పురుషులకు 948 మంది మహిళా ఓటర్లు
ఏప్రిల్ 1 వరకు ఓటర్ల జాబితాలో మార్పులకు అవకాశం
వార్నింగ్..!
టీవీ, సోషల్ మీడియా ప్రకటనలపై నిరంతరం నిఘా
ఎన్నికల విధులకు దూరంగా వలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది
పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలు కేవైసీ యాప్‌లో చూడవచ్చు
అభ్యర్థి పూర్తి వివరాలను ప్రతి ఓటరూ తెలుసుకోవచ్చు
ఓటర్లకు తాయిలాలు, నగదు పంపిణీ జరిగితే..
ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు
సీ- విజిల్ యాప్ ద్వారా ఓటర్లు ఫిర్యాదు చేయవచ్చు
ఎన్నికల్లో హింసను అరికట్టేందుకు CRPF బలగాలతో రక్షణ
ఈడీ, ఐటీ సహకారంతో అన్ని రాష్ట్రాల్లో ఈసీ నిఘా
వలంటీర్లు వద్దు!
వలంటీర్లకు చెక్ పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల విధులకు దూరంగా వలంటీర్లు
వలంటీర్లను వాడేయాలని చూసిన వైఎస్ జగన్
ఈసీ నిర్ణయంతో జగన్‌కు బిగ్ షాక్
దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
ఎన్నికల్లో హింసకు పాల్పడితే నాన్‌బెయిలబుల్ వారెంట్
స్టార్ క్యాంపెయినర్లు ఈసీ మార్గదర్శకాలు పాటించాల్సిందే
దేశవ్యాప్తంగా 2100 మంది పరిశీలకులను నియమించాం: సీఈసీ
నోటిఫికేషన్ ఇలా..!
ఏప్రిల్ 18న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్
ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ
ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు
మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, జూన్ 4న కౌంటింగ్
ఏప్రిల్ 19న లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్
ఏప్రిల్ 26న రెండో విడత, మే 7న మూడో విడత
మే 13న నాలుగో విడత, మే 20న ఐదో విడత
మే 25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత పోలింగ్
నాలుగో విడతలో ఏపీలో ఎన్నికల పోలింగ్
దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు
తెలంగాణలో కంటోన్మెంట్ ఉపఎన్నికకు షెడ్యూల్‌కు విడుదల