రెండు రోజుల క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారంటూ కథనాలు ప్రచారంలోకి రావడమే కాకుండా.. అమితాబ్ గుండెకి రక్తం సరఫరా అయ్యే నాళాల్లో క్లాట్స్ ఏర్పడంతో ఆయనికి ఆంజియోప్లాస్టీ సర్జరీ చేసారు అంటూ వచ్చిన వార్తలతో అమితాబ్ అభిమానులు కలవరపడ్డారు. అమితాబ్ కి ఏమైందో అనే ఆందోళన వారిలో కనిపించడమే కాకుండా.. ట్వీట్లు చేస్తూ హడావిడి చేసారు.
అయితే అమితాబచ్చన్ నిన్న శనివారం ముంబై లో జరిగిన ISPL ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. అభిషేక్ బచ్చన్ తో కలిసి అమితాబ్ అక్కడ మ్యాచ్ తిలకించేందుకు రావడంతో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆరాతియ్యడంతో అదంతా ఫేక్ న్యూస్ అని, తన ఆరోగ్యానికి ఏమి కాలేదని అమితాబ్ తెలపడంతో అమితాబ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ రూమర్ గా మిగిలిపోయాయి.
దానితో ఆయన అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం అమితాబ్ సౌత్ ప్యాన్ ఇండియా ఫిలిం కల్కిలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.