ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిన్నటివరకు ఇటలీలోనే ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2098AD చిత్రానికి సంబంధించి ఓ సాంగ్ షూట్ కోసం హీరోయిన్ దిశా పటానితో కలిసి టీమ్ మొత్తం ఇటలీకి వెళ్ళింది. అక్కడ పాట చిత్రీకరణ పూర్తి కావడంతో ప్రభాస్ ఈరోజు శనివారం ఉదయం ఇండియాకి వచ్చేసారు. ప్రభాస్ ఎయిర్ పోర్ట్ లో నడిచొస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రభాస్ ఇంతకుముందు అమెరికాలో ఉన్నారు. అక్కడి నుంచి కల్కి సాంగ్ కోసం ఇటలీ వెళ్లారు. అలా చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఇండియాకి వచ్చారు అని ఆయన అభిమానులు చాలా హ్యాపీ గా ఫీలవుతున్నారు. ప్రసుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి చిత్రం మే 9 న విడుదలకు సిద్ధమవుతుండగా.. మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్ షూటింగ్ లో త్వరలోనే పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ షూటింగ్ మొదలు పెట్టారని తెలుస్తోంది.