Advertisementt

నాకే ఎందుకిలా.. కేసీఆర్ కంటతడి!

Sat 16th Mar 2024 10:15 AM
kavitha  నాకే ఎందుకిలా.. కేసీఆర్ కంటతడి!
Why me.. KCR tears! నాకే ఎందుకిలా.. కేసీఆర్ కంటతడి!
Advertisement
Ads by CJ

రాజకీయ పండితుడు, అపర చాణక్యుడిగా పేరుగాంచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కసారిగా డీలా పడిపోయారా..? తెలంగాణ మొదలుకుని దేశాన్ని ఏలడానికే సిద్ధమైన నాకే ఎందుకిలా జరిగిందని కంటతడిపెట్టారా..? ఇటీవల జరిగిన పరిణామాలన్నింటినీ పదే పదే గుర్తు తెచ్చుకుని బోరున ఏడ్చేశారా..? అంటే గులాబీ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వస్తున్నాయ్. బాస్‌కు ఎందుకీ పరిస్థితి..? ఈ వరుస పరిణామాల నేపథ్యంలో సారు ఏం చేయబోతున్నారు..? అనే ఇంట్రెస్ట్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఇదీ అసలు సంగతి ..

తెలంగాణను సాధించింది కేసీఆరేనని.. తెలంగాణ గాంధీగా, బాపుగా చెప్పుకుంటూ ఉంటారు రాష్ట్ర ప్రజలు, అభిమానులు. రాష్ట్రాన్ని సాధించినోడిని, రెండు పర్యాయాలు వరుసగా అధికారం దక్కించుకున్నోడిని ఇక ఏముంది దేశాన్ని ఏలేయచ్చు అని టీఆర్ఎస్‌ను కాస్త బీఆర్ఎస్‌గా మార్చేశారు బాస్. సీన్ కట్ చేస్తే.. ఇటు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్న కల.. అటు దేశ రాజకీయాల్లోకి చక్రం తిప్పాలన్న ఆశ రెండూ ఆవిరయ్యాయ్. వాస్తవానికి.. దేశాన్ని పాలించాలని అత్యుత్సాహ పడటమే సారు చెప్పిన మొదటి తప్పని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ముందు ఇంట గెలిచి.. తర్వాత రచ్చ గెలవాలన్న విషయాన్ని మరిచి ఏదోదే ఆలోచించి ఆఖరికి అట్టర్ ప్లాప్ అయ్యి.. ఇంట్లో కూర్చున్నారన్నది సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న మాట. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన బీఆర్ఎస్.. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు నిలుపుకావాలని సాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. అలా బీఆర్ఎస్ ఓడిపోయిందో లేదో ఆ మరుసి రోజు నుంచే పతనం ప్రారంభమైంది. నమ్మినబంటుగా ఉన్న నేతలు మొదలుకుని సిట్టింగుల వరకూ ఒక్కొక్కరూ పార్టీని వదిలేసి కాంగ్రెస్, కాషాయ కండువాలు కప్పేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇప్పుడు బీఆర్ఎస్‌కు ఎంపీ అభ్యర్థులు కరువైన పరిస్థితి. చూశారుగా.. బీఆర్ఎస్ పరిస్థితి ఎక్కడ్నుంచి ఎక్కడికి పడిపోయిందో..!

అటు.. ఇటు అన్నీ తిప్పలే..!

అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనారోగ్యానికి గురైన కేసీఆర్.. పార్టీలో జరుగుతున్న వరుస పరిణామాల రీత్యా.. ఇలాగే ఉంటే పార్టీ మనుగడకే కష్టమని స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే పార్లమెంట్ అభ్యర్థులు, ఎన్నికల ప్రచారం చేస్తూ వస్తున్నారు. అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు జంపింగ్‌లు చేస్తున్న తరుణంలో డీలా పడిపోయిన కేసీఆర్‌కు.. కుమార్తె కవిత అరెస్ట్‌ మరింత కుంగదీసిందట. ఉద్యమాలు, అరెస్టులు కేసీఆర్‌కు కొత్త కాకపోవచ్చు కానీ.. సమయం, సందర్భం అనేది ఇక్కడ కీలకం. కవిత ఇంట్లో ఈడీ సోదాలు చేయడం, కేటీఆర్, హరీష్ వెళ్లాక జరిగిన పరిణామాలు.. ఆఖరికి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లడం.. ఇటు ఎన్నికల టైమ్ కావడంతో ఎటు ఏం చేయాలో సారుకు తోచట్లేదట. ఎందుకీ పరిస్థితి.. అంత తప్పు ఏం చేశామని అంటూ తన కుటుంబ సభ్యులతో చెప్పి కంటతడిపెట్టారట. పక్కనే ఉన్న సతీమణి, సంతోష్‌లు ఓదార్చారట. ఇలాంటివెన్నో చూసిన మీకు ఈ అరెస్ట్ ఒక లెక్కా అంటూ సముదాయించారట. ఈ విషయం తెలియడంతో బీఆర్ఎస్ వర్గాలు సైతం ఆవేదన చెందాయట. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేంద్రంపై మౌనం పాటిస్తూ వస్తున్న కేసీఆర్.. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు..? మరోసారి మోదీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతారా..? లేకుంటే అరెస్ట్ కదా బెయిల్ రాకుండా పోతుందా అని మిన్నకుండిపోతారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే.. కవిత ఇంత చేస్తున్నా కనీసం కేసీఆర్‌కు తెలియకపోవడమేంటి.. ఇదంతా అధికార మదంతో, దనదాహంతో చేసిన పనే ఇప్పుడు ఇలా కావడానికి కారణమని ప్రతిపక్షాలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. వచ్చాక ఇంకెలా ఉంటుందో మరి.

Why me.. KCR tears!:

Kavitha arrest-KCR tears

Tags:   KAVITHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ