సమంత నాగ చైతన్య తో వివాహ బంధానికి ముగింపు పలికి విడాకులు తీసుకున్నాక తనపై సింపతీ వచ్చెందుకు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టింది అంటూ ఆమెని ట్రోల్ చేసిన వారిపై అప్పట్లో ఆమె కోర్టులో కేసు కూడా వేసింది. ఆ తర్వాత సమంత సినిమాలపై ఫోకస్ పెట్టింది. మళ్ళీ సినిమాలు చేసుకుంటూ షూటింగ్ లకి హాజరవుతున్న సమయంలో మాయోసైటిస్ వ్యాధి బారిన పడి ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించడంతో ఆమె సింపతీ కోసం ఆరాటపడుతుంది.. అంటూ సింపతీ క్వీన్ అనే ట్యాగ్ తగిలించారు.
ఆ తర్వాత కూడా హెల్త్ విషయంలో ఆమె చేసిన పోస్టులు ఆమెని మరింతగా ట్రోల్ చేసేలా చెయ్యడం ఆమెని చాలా బాధించింది. తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో తానేమి సింపతీ కోసం తన వ్యాధిని బయటపెట్టలేదు, యశోద మూవీ సమయంలో తాను సినిమాని ప్రమోట్ చెయ్యకపోతే సినిమా చచ్చిపోయేలా ఉంది అని నిర్మాత ఆవేదన చెందడంతో తన వ్యాధి గురించి బయటపెట్టాల్సి వచ్చింది.. లేదంటే చెప్పేదాన్ని కాదు అంటూ చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా తన కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు కూడా తాను కొన్ని కారణాల వలన పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయినట్లు చెప్పింది. తాను ఒక్కప్పుడు ఐదు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని అని, మిగతా సమయమంతా పని పని అంటూ కష్టపడుతూ ఉండేదాన్ని అని, అప్పట్లో ఇంపోస్టర్ డిజార్డర్‌తో ఇబ్బంది పడ్డానని.. తాను సాధించిన సక్సెస్‌లో తన ప్రమేయం లేదని.. ఈ సక్సెస్ మనకి ఎక్కువ కాలం ఉండదని అనిపించేదని.. అందువల్ల టాప్ పొజిషన్ కి వెళ్లిన ఆ క్షణాలను ఆస్వాదించలేకపోయాను అంటూ చెప్పుకొచ్చింది.