రీసెంట్‌గా సత్యం చిత్ర దర్శకుడు సూర్య కిరణ్ అకాల మరణం చెందడం పట్ల ఆయన ఫ్యామిలీనే కాదు.. చాలామంది సినీ ప్రముఖులు, ఆయన స్నేహితులు దిగ్బ్రాంతికి గురయ్యారు. హెల్త్ ఇష్యూ కారణంగా సూర్య కిరణ్ 51 ఏళ్ళ వయసులోనే మృతి చెందారు. అయితే ఆయన మరణంపై ఆయన మాజీ భార్య కళ్యాణి ఏమైనా స్పందిస్తుంది అని చాలామంది ఎదురు చూశారు. నటి కల్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్య కిరణ్ ఆమెతో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు.
అయినప్పటికీ ఆయన కళ్యాణిపై చాలా ప్రేమ చూపిస్తూ మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఆమె ఎక్కడా మాట్లాడలేదు కానీ.. సూర్య కిరణ్ చెల్లెలు నటి సుజిత.. తన అన్న మృతిపై రియాక్ట్ అయ్యింది. చైల్డ్ ఆర్టిస్ట్ అప్పటి నుండి ఆమె అందరికీ పరిచయమే. ప్రస్తుతం బుల్లితెర మీద సీరియల్స్ చేస్తూ ఫేమస్ అయ్యింది.
తన అన్న సూర్య కిరణ్ మరణంపై సుజిత స్పందిస్తూ.. మా అన్నయ్య చాలా మంచివాడు, ఆయన నాకు అన్నయ్య మాత్రమే కాదు, నా హీరో, నాకు తండ్రి. అన్నయ్యా.. నీ టాలెంట్ కి, నీ మాటలకూ నేను ఎప్పుడు అభిమానినే. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కలలు సాకారం అవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ సుజిత అన్న మృతిపై రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అయ్యింది.