బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఆసుపత్రి పాలయ్యారు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలతో బిగ్ బి ఫాన్స్ ఆందోళన పడుతున్నారు. ఈరోజు శుక్రవారం ఉదయమే అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురికావడం వల్ల ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అసలు అమితాబ్ ఎందుచేత ఆసుపత్రికి వెళ్లారు, ఆయన కి ఉన్న హెల్త్ ఇస్యూస్ ఏమిటి అనేది తెలియరాలేదు కానీ.. T 4950 ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా అంటూ అమితాబచ్చన్ చేసిన ట్వీట్ తో ఆయనకి ఏమైందో అనే అనుమానం ఫాన్స్ లో మొదలయ్యింది.
అయితే బాలీవుడ్ మీడియా లో వినిపిస్తోన్న న్యూస్ ప్రకారం అమితాబ్ ఈ రోజు ఉదయం కోకిలాబెన్ ఆస్పత్రిలో టైట్ సెక్యూరిటీ మధ్య అడ్మిట్ అయ్యారట. అమితాబ్ కి యాంజియోప్లాస్టి సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది. అదే కాకుండా బిగ్ బీకి శ్వాస ఆడకపోవటంతో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారట. అయితే అమితాబ్ కి అసలు ఏ హెల్త్ ఇష్యు ఉందో తెలియదు కానీ.. బాలీవుడ్ లో మాత్రం ఈ రకమైన న్యూస్ లు చక్కర్లు కొడుతున్నాయి.
అమితాబ్ క్షేమంగా, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి రావాలని అయన అభిమానులు భగవంతుడిని వేడుకుంటున్నారు. మరోపక్క బిగ్ బి ఆరోగ్య కారణాలతో కల్కి 2898AD ఎమన్నా పోస్ట్ పోన్ అవ్వొచ్చా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.