అల్లు అర్జున్ పుష్ప తర్వాత నార్త్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. సోలో హిట్ తో భారీగా గ్రాఫ్ పెంచుకున్న అల్లు అర్జున్ నుంచి రాబోయే పుష్ప 2 పై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి అంతేకాకుండా యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగతో అల్లు అర్జున్ మూవీని ప్రకటించడం, ఆ తర్వాత త్రివిక్రమ్ తో క్రేజీ ప్యాన్ ఇండియా ఫిలిం ని లైన్ లో పెట్టడంతో అల్లు అర్జున్ లైనప్ పై అందరి దృష్టి పడింది.
ఇక కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో అల్లు అర్జున్ మూవీ అనే మాట సినీ వర్గాల్లో ఎప్పటి నుంచో వినిపిస్తుంది. కానీ ఈ ప్రాజెక్ట్ పై ఎక్కడా క్లారిటీ లేదు. అప్పుడప్పుడు అట్లీ - అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పై సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎవరూ స్పందించడం లేదు. అట్లీ జవాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత అట్లీ కొత్త ప్రాజెక్ట్ పై అందరిలో ఆసక్తి మొదలైంది. ఈలోపు అల్లు అర్జున్ తో అట్లీ ప్రాజెక్ట్ పై ఓ క్రేజీ అప్ డేట్ బయటికి వచ్చింది.
అది ఓ వీడియో రూపంలో. ఆ వీడియో లో అల్లు అర్జున్, అట్లీ, అనిరుద్ ఇంకాకొంతమంది డిస్కస్ చేస్తూ కనిపించారు. ఈ డిస్కషన్ అంతా అల్లు అర్జున్ తో అట్లీ కలసి ప్రాజెక్ట్ చెయ్యడానికే అన్నట్టుగా టాక్. ఈ సెన్సేషనల్ కాంబినేషన్ అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఈ ఏప్రిల్ 7 లేదా 8న రావచ్చు అంటూ అప్పుడే ప్రచారం మొదలయ్యింది.