హనుమాన్.. సినిమా విడుదలై 50 రోజులకు పైగా పూర్తయ్యాయి. అయినా కూడా జనాలు అదే ఫీవర్‌లో ఉన్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో వదులుతారా? అని ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు డేట్స్ హనుమాన్ ఓటీటీ రిలీజ్ విషయంలో వినిపించినా.. ఆ డేట్‌కి స్ట్రీమింగ్‌లోకి రాలేదు. మార్చి 8న శివరాత్రి స్పెషల్‌గా ఓటీటీలో విడుదల అనే వార్తలు వచ్చినా.. ఆ రోజు కూడా స్ట్రీమింగ్ కాలేదు. దీంతో ప్రేక్షకులు బాగా నిరాశ చెందారు. అయితే ఆ తర్వాత వెంటనే మార్చి 16 అంటూ అధికారిక ప్రకటన వచ్చింది కానీ.. అది ఓటీటీలో కాదు.
హనుమాన్ డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న జీ5.. ఇంత వరకు ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో త్వరగా ఓటీటీలో వదలండి బ్రో అంటూ ప్రశాంత్ వర్మకు నెటిజన్లు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. హనుమాన్ హిందీ వెర్షన్ డైరెక్ట్‌గా టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అయింది. మార్చి 16న రాత్రి 8 గంటలకు ఈ సినిమాను కలర్స్ సినీప్లెక్స్ ఛానల్, జియో సినిమా టెలికాస్ట్ చేయబోతున్నాయి. హిందీ మినహా ఇతర భాషలలో ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనేది మాత్రం ఇంకా సస్పెన్సే.
తాజాగా ప్రశాంత్ వర్మ ట్విట్టర్ వేదికగా.. బ్యాక్ టు మై హ్యాపీ ప్లేస్, రెడీ బాబు రెడీ అంటూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ జై హనుమాన్ సినిమాకు షూటింగ్‌కు చెందినదే అని అర్థమవుతోంది. ఈ క్రమంలో.. పార్ట్ 2 షూటింగ్ జరుగుతుంది.. ఇకనైనా హనుమాన్‌ని ఓటీటీలోకి వదలండి బ్రో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌తో మరోసారి హనుమాన్ మూవీ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీంతో.. త్వరలోనే హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తోంది.