కుబేర సెట్స్‌లోకి కింగ్ నాగార్జున అడుగుపెట్టారు. కింగ్ నాగార్జున, ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం కుబేర. రీసెంట్‌గానే ఈ చిత్రానికి కుబేర అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మహాశివరాత్రి స్పెషల్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో ధనుష్‌ని చూసిన వారంతా.. ఇదొక డిఫరెంట్ సినిమాగా భావిస్తున్నారు. అందులోనూ శేఖర్ కమ్ముల దర్శకుడు కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ తెలియజేశారు.
బ్యాంకాక్‌లో కుబేర కొత్త షూటింగ్ షెడ్యూల్‌లో ప్రారంభమైనట్లుగా తెలుపుతూ.. నాగార్జున సెట్స్‌లో ఉన్న పిక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ వర్కింగ్ స్టిల్‌లో నాగార్జున, శేఖర్ కమ్ముల సంభాషిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగార్జునతో పాటు మరికొందరు నటీనటులు పాల్గొననున్న ఈ షెడ్యూల్‌లో కొంత టాకీ, యాక్షన్ పార్ట్‌ని చిత్రీకరించనున్నారు. ఇప్పటి వరకు కనిపించని లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నట్లుగా ఈ అప్‌డేట్‌లో మేకర్స్ వెల్లడించారు.
శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఆసియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.