ఆంధ్రుల ఆరాధ్యుడు.. అన్నగారు నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాల్సిందే.. ఈ డిమాండ్ కొన్నేళ్లుగా నడుస్తూనే ఉంది. నిన్న, మొన్న అవార్డులు ప్రకటించినప్పుడు ఎన్టీఆర్ పేరు లేకపోవడంతో పెద్ద రచ్చే జరిగింది. సినిమా, రాజకీయాల్లో విశిష్ట సేవలు అందించిన ఆయనకు ఎందుకు ఇవ్వరు..? అసలు అన్న గారిని ఎందుకు పట్టించుకోరు అని ఒకింత సదరు ఆంధ్రుడు కన్నెర్రజేసిన పరిస్థితి. ఈ డిమాండ్ దెబ్బకు తగ్గిన కేంద్రంలోని మోదీ సర్కార్.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే బుధవారం (మార్చి-13న) సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే ఆంధ్రుడి కల నెరవేరినట్లేనని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ చెబుతున్న మాట.
చర్చలతోనే సరిపెడతారా..?
కేంద్ర కేబినెట్ సమావేశం బుధవారం నాడు జరగనుంది. ఈ మంత్రివర్గ భేటీలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే అంశంపై చర్చించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్‌కు భారతరత్న కోరుతూ కేంద్రానికి పెద్ద ఎత్తున ఇప్పుటికే పలు ప్రతిపాదనలు, వినతులు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వినతులను పరిశీలించిన మోదీ సర్కార్.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందేనని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్‌లో నిశితంగా చర్చించిన తర్వాత అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు.. అబ్బే అదేం లేదు అస్సలు అవార్డుల గురించి చర్చించే ఛాన్సే లేదని.. ఇప్పటికే ప్రకటనలు వచ్చేశాయి కదా పదే పదే ఇంకెందుకు ఉంటాయనే చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ ఇవాళ్టి కేబినెట్‌లో నిజంగానే చర్చకు వచ్చే ఛాన్స్ ఉంటే.. ఇవన్నీ చర్చల వరకేనా.. లేకుంటే ఆచరణలోకి వచ్చే అవకాశముంటుందా అనేది.. అధికారిక ప్రకటన వచ్చే వరకూ నమ్మలేదని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.
ఇదే సువర్ణావకాశం..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలక్షన్ ముందు గనుక ఈ ప్రకటన వస్తే కాస్తో కూస్తో బీజేపీకి ఓట్లు రాలే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఎన్నాళ్లుగానే భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ డిమాండ్.. ఆంధ్రుడి కోరికను నెరవేరిస్తే ఇక ఏముంది.. ఆల్ హ్యాపీస్.. బీజేపీకి ఇదొక సువర్ణావకాశమే. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ చేరిన తర్వాత ఈ డిమాండ్ నెరవేరబోతోందని.. ఇదంతా టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల వల్లే సాధ్యమైందనే చర్చలు సైతం నెట్టింట్లో అప్పుడే షురూ అయ్యాయి. ఏదైతేనేం కూటమి ఓట్ల కోసం ఇలాంటి ప్రకటన చేస్తోందా.. ఎన్నికల ముందు స్టంటా అనేది పక్కనెడితే సగటి ఆంధ్రుడి కల నెరవేరబోతోందన్న మాట. కాగా.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందేనని.. ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి..? అనేదానిపై భారతరత్న ఎన్టీఆర్.. బాధ్యత ఎవరిది..? అని ప్రత్యేక కథనాలు కూడా ప్రచురించడం జరిగింది. ఈ లింక్ క్లిక్ చేసి ఆ కథనాన్ని చూడొచ్చు.