బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ పెళ్ళయ్యి ఏడాది గడిచిపోయినా.. అమ్మడు గ్లామర్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. సిద్దార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకున్న కియారా ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీబిజీగా ఉంది. పెళ్ళికి ముందే సౌత్‌లో గేమ్ ఛేంజర్ లాంటి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగమైంది. ఇప్పుడు ఎన్టీఆర్-హృతిక్ రేషన్ కాంబోలో రూపుదిద్దుకుంటోన్న వార్ 2 లో నటించబోతుందనే టాక్ ఉండగానే.. బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. ఇందులో రణవీర్ సింగ్ హీరో.
ఇక కియారా అద్వానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కళ్ళు చెదిరే ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. గ్లామర్ కి గ్లామర్, మోడ్రెన్ అవుట్ ఫిట్స్ తో హంగామా చేస్తుంది. రీసెంట్ గా అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భర్త సిద్దార్థ్‌తో కలిసి సరదాగా గడిపిన కియారా అద్వానీ గ్లామర్ తోనే ఎట్రాక్ట్ చేసింది. స్టైలిష్ గౌనులో జీ సినిమా అవార్డ్స్ లో చాలా ఘాటుగా దర్శనమిచ్చింది. కియారా రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే.. ఫోటో గ్రాఫర్స్ ఆమె పిక్స్ తీసేందుకు అలెర్ట్ అయ్యారు.
గ్లామర్ విషయంలో చాలా ఫాస్ట్‌గా ఉండే కియారా అద్వానీ స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాకి కొత్తకాకపోయినా.. తాజాగా కియారా లుక్ చూసినవారు కిల్లింగ్ లుక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.