Advertisementt

టిల్లు హడావిడి ఎక్కడ..?

Mon 11th Mar 2024 11:37 AM
tillu square  టిల్లు హడావిడి ఎక్కడ..?
Tillu Square shooting update టిల్లు హడావిడి ఎక్కడ..?
Advertisement
Ads by CJ

ఇప్పటికే రెండు మూడు డేట్స్ మార్చుకుని చివరిగా మార్చి 29 న విడుదల కి సిద్ధమంటూ పోస్టర్ తో సహా ప్రకటించిన టిల్లు స్క్వేర్ అదేనండి కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. టిల్లు బాయ్ అంటూ హంగామా చేసే సిద్దు జాడ లేదు. సినిమా రిలీజ్ కి దగ్గరపడింది. కానీ సిద్దు మాత్రం ఇంకా టిల్లు స్క్వేర్ షూటింగ్ లోనే ఉన్నాడనే న్యూస్ ఆయన అభిమానులని కలవర పెడుతుంది. అంతేకాదు మరొక్కసారి టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ మారుతుందా అనే కంగారు కూడా వారిలో మొదలైంది.

ఇప్పటికే మూడు నాలుగు పోస్టర్స్, టీజర్ లాంటివి వదిలి ఈప్రాజెక్టు పై విపరీతమైన క్యూరియాసిటీ కలిగించిన మేకర్స్ టిల్లు స్క్వేర్ రిలీజ్ విషయంలో పదే పదే చెబుతున్నా ప్రస్తుతం ఎందుకంత లైట్ గా ఉన్నారో అర్ధం కావడం లేదు. తాజా సమాచారం ప్రకారం టిల్లు స్క్వేర్ లాస్ట్ షెడ్యూలు కాకినాడ లో 12 నుంచి ప్రారంభమవుతుంది. కాకినాడ పోర్ట్ లో టిల్లు 2 క్లయిమాక్స్ కు సంబంధించిన మ్యాచింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఆరు రోజుల వరకు అక్కడే షూట్ వుంటుంది.. అనే అప్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరి ఈ లెక్కన మార్చ్ 29 న టిల్లు స్క్వేర్ విడుదలవుతుందా? లేదంటే మరోసారి సిద్దు ఫాన్స్ ని డిస్పాయింట్ చేస్తూ విడుదల తేదీని మారుస్తారా అనేది ఇప్పుడు అందరిలో మొదలైన సస్పెన్స్. 

Tillu Square shooting update:

Tillu Square Release Update

Tags:   TILLU SQUARE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ