ప్రేక్షకులు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. తాము సినిమా కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వర్త్ లేదు అనుకుంటే థియేటర్స్ వైపు చూడడమే మానేశారు. భారీ బడ్జెట్ సినిమా అయినా, స్టార్ హీరో సినిమా అయినా ఏదైనా ప్రేక్షకుల లెక్క ఒక్కటే. సినిమా బావుందా, లేదా. అయితే సినిమా విడుదలకు ముందు సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు హీరోలు, మేకర్స్ చాలా కష్టపడుతున్నారు. డిఫ్రెంట్ గా ఆలోచిస్తున్నారు. అందుకే ప్రమోషన్స్ విషయాన్ని చాలామంది హీరోలు ప్రస్టేజియస్ గా తీసుకుంటున్నారు.
తాజాగా ఓ రెండు సినిమాలకి ఒకేరకమైన టాక్ వచ్చింది. కానీ అందులో ఓ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తుంటే మరో సినిమా హడావిడి కనిపించడం లేదు. కారణం ప్రమోషన్స్ మాత్రమే. ఆ సినిమాలేవో కాదు గత శుక్రవారం విడుదలైన గామి, భీమా చిత్రాలకి పబ్లిక్ నుంచి, క్రిటిక్స్ నుంచి ఒకేరకమైన రెస్పాన్స్ వచ్చింది. గామిలో విశ్వక్ డిఫరెంట్ గా ట్రై చేసాడు, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా గామి బావుంది అన్నారు. ఇక గోపీచంద్ భీమా ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ అదిరిపోయాయి, కామెడీ బావుంది అంటూ మాట్లాడారు.
విశ్వక్ సేన్ గామి విడుదలకు ముందు, విడుదలయ్యాక కూడా ప్రమోషన్స్ ఆపడం లేదు. అంతేకాకుండా కలెక్షన్స్ పోస్టర్ వదులుతూ రచ్చ చేస్తున్నాడు. విశ్వక్ సేన్ గామి చిత్రం హిట్ అవ్వాలని ప్రమోషన్స్ ని ప్రస్టేజియస్ గా తీసుకున్నాడు. మరోపక్క గోపీచంద్ కూడా భీమా సినిమాని విడుదలకు ముందు బాగానే ప్రమోట్ చేసాడు. కానీ భీమా విడుదలయ్యాక గోపీచంద్ అంతగా సినిమాని పట్టించుకొలేదేమో అందుకే ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లేదంటే ఒకే రకమయిన రిజల్ట్ అందుకున్న రెండు సినిమాలకు థియేటర్స్ లో ఒకేరకమయిన కలెక్షన్స్ ఎందుకు రావడం లేదు. దీనికి కారణం కేవలం పబ్లిసిటీ మాయే అనేది ఖచ్చితంగా చెప్పగలం.