బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో నితీష్ తివారి దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ మీదికి వెళ్ళబోతున్న రామాయణం చిత్రానికి ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఆదిలోనే ఓ క్రేజీ నటుడు తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. మూడు పార్ట్ లుగా రామాయణం ని తెరకెక్కిస్తున్నామంటూ.. వచ్చే నెల శ్రీరామనవమీ సందర్భంగా అయోధ్యలో ఈ చిత్రాన్ని మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్న మేకర్స్ కి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. రామాయణం లో రాముడిగా రణబీర్ కపూర్, సీత గా సాయి పల్లవి పేర్లు ఫిక్స్ అయ్యాయి.
ఇక రావణ్ గా యష్ పేరు తెరపైకి వచ్చింది, మరోపక్క విభీషునిడిగా తమిళ క్రేజీ నటుడు విజయ్ సేతుపతి పేరు వినిపించింది. సుర్పణకగా రకుల్ ప్రీత్ సింగ్, లక్షణుడిగా నవీన్ పోలిశెట్టి పేరు వినిపిస్తున్న సందర్భంలో విజయ్ సేతుపతి విభీషుణుడి కేరెక్టర్ నుంచి తప్పుకుంటున్నట్టుగా దర్శకుడు నితీష్ తివారీకి చెప్పినట్టుగా తెలుస్తుంది. తాను డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేనని విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది.
దానితో విజయ్ సేతుపతి ప్లేస్ లో క్యారెక్టర్ ఆర్టిస్టు హర్మన్ బవేజా వచ్చి చేరినట్టుగా తెలిసింది. మరి క్రేజీ పాత్రల కోసం మల్టిపుల్ టాలెంట్స్ ఉన్న నటులని ఏరి కోరి తీసుకొస్తున్న నితీష్ కి విజయ్ సేతుపతి తప్పుకోవడం షాకింగ్ అనే చెప్పుకోవాలి. విజయ్ సేతుపతి కేవలం డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేని కారణంగానే ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని అంటున్నారు.