Advertisementt

అల్లు అర్జున్ క్రేజ్ అబ్బో ఓ రేంజ్ లో !

Sun 10th Mar 2024 05:34 PM
allu arjun  అల్లు అర్జున్ క్రేజ్ అబ్బో ఓ రేంజ్ లో !
Allu Arjun has arrived in Visakhapatnam అల్లు అర్జున్ క్రేజ్ అబ్బో ఓ రేంజ్ లో !
Advertisement
Ads by CJ

పుష్ప ద రైజ్ తో అల్లు అర్జున్ క్రేజ్ ఎంతగా పెరిగిందో చెప్పడం కష్టమే. పుష్ప తో సోలోగా బాలీవుడ్ బాక్సాఫీసుని షేక్ చేసిన అల్లు అర్జున్ క్రేజ్ నార్త్ లో విపరీతంగా పెరిగింది. పుష్ప ద రూల్ వచ్చేసరికి అల్లు అర్జున్ గ్రాఫ్ ఇంకెంతగా పెరుగుతుందో చెప్పడం కష్టమే. ప్రస్తుతం పుష్ప ద రూల్ షూటింగ్ లో పాల్గొంటున్న అల్లు అర్జున్-సుకుమార్ లు ఈ రోజు ఆదివారం స్పెషల్ ఫ్లైట్ లో వైజాగ్ బయలుదేరి వెళ్లారు. అక్కడ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పుష్ప 2 లోని కీలక షెడ్యూల్ ని ప్లాన్ చేసారు.

అల్లు అర్జున కోసం రోజు ఉదయం నుంచే ఆయన అభిమానులు వైజాగ్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కాచుకుని కూర్చున్నారు. అల్లు అర్జున్ ఫ్లైట్ దిగి రాగానే ఆయనపై పూల వర్షం కురిపించే ప్లాన్ చేసారు. అల్లు అర్జున్ కి వైజాగ్ లో ఘన స్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు తండోప తండాలుగా రావడం చూసిన నెటిజెన్స్.. అల్లు అర్జున్ క్రేజ్ ఏముందిరా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అర్జున్ ఎయిర్ పోర్టులో స్టయిల్ గా నడుస్తున్న వీడియోస్, పిక్స్ వైరల్ గా మారాయి.

ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి బయటికొచ్చాక కారు ఓపెన్ టాప్ లో నించుకుని అభిమానుల నీరాజనాలు అందుకుంటూ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగిన వీడియోస్ కూడా వైరల్ గా మారాయి.

ఇక ఈ వైజాగ్ షెడ్యూల్ లో రష్మిక-అల్లు అర్జున్ లపై కొన్ని కీలక సన్నివేశాలును సుకుమార్ తెరకెక్కిస్తారని, ఓ పాట చిత్రీకరణ కూడా వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనే షూట్ చేస్తారని తెలుస్తోంది. 

Allu Arjun has arrived in Visakhapatnam :

 Allu Arjun has arrived in Visakhapatnam to shoot for Pushpa: The Rule 

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ