టీడీపీతో బీజేపీ పొత్తు ఆలస్యమవుతున్న కొద్దీ వైసీపీ అధినేత జగన్‌లో ఆశలు చిగురించాయి. బీజేపీ పెద్దలు ఇంత తాత్సారం చేస్తున్నారంటే పొత్తు ఎత్తిపోద్దని భావించారు కానీ నిన్న బీజేపీ నుంచి పొత్తు ప్రకటన అధికారికంగా వచ్చేసింది.. దెబ్బకు చచ్చింది గొర్రె. ఏం చేయాలో తెలియదు.. టీడీపీ,జనసేనలైతే ఎలాగోలా తమ పోలీస్ యంత్రాంగాన్నంతా ఉపయోగించి ఎదుర్కొందామని చూశారు. వలంటీర్లతో మేనేజ్ చేద్దామనుకున్నారు. దొంగ ఓట్లతో లాగించేద్దామనుకున్నారు. ఒక్క దెబ్బకు దొంగల ముఠా ఠా. ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న ఒక్కగానొక్క ఆశ కూడా పాయే.. ఇక ఇప్పుడు కూటమిని చచ్చినట్టు ఎదిరించాల్సిందే..
కేసులన్నీ వరుసబెట్టి మూవ్ అవుతాయ్..
ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. ఇప్పటి వరకూ తల్లి చాటు బిడ్డలా బీజేపీ మాటున దాక్కోవడానికి అవదు. పైగా టీడీపీ, జనసేనలతో పాటు బీజేపీని కూడా తిట్టాల్సిందే. తూచ్.. నేను రెండు పార్టీలనే తిడతా.. బీజేపీ జోలికి వెళ్లనంటే కుదరదు. ప్రస్తుతం మంత్రసాని పొజిషన్ జగన్‌ది. ఏమొచ్చినా పట్టాల్సిందే. పోనీ తప్పదు కాబట్టి బీజేపీని తిడదామా? కేసులన్నీ వరుసబెట్టి మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. పోనీలే నేను తిట్టకుండా నా కాలకేయ సైన్యంతో తిట్టిద్దామంటే.. ఎవరు తిట్టినా అంతిమంగా పేరు జగన్‌దే అవుతుంది.. జగన్ తిట్టిస్తున్నట్టే అవుతుంది. ఏమీ చేయడానికీ లేదు.. అలాగని ఊరుకోవడానికీ లేదు. అబ్బో పెద్ద చిక్కే వచ్చిపడిందే.. మొత్తానికి జగన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.
మిత్రపక్షాలు కూడా చూడట్లే..
కాలకేయ సైన్యం కూడా ప్రత్యర్థి పార్టీలను తిట్టడంలో బీభత్సమైన ఆనందం ప్రదర్శిస్తుంది కానీ ఈ క్రమంలోనే బీజేపీని కూడా వరుసబెట్టిందో ఆ ఆనందం ఖరీదు ఎంత మూల్యమో చిన్న పిల్లాడికి కూడా తెలుసు. కాబట్టి తిట్టామా? లేదా? అన్నట్టుగానే ఉండాలి. నిజానికి కాలం ఇంతలా పగబడుతుందని ఎవరూ ఊహించరు. సంక్షేమ పథకాలు విచ్చలవిడిగా ప్రవేశ పెడుతున్నాం ఇంకేముంది? జనబలం నాకే మెండుగా ఉందని విర్రవీగిన జగన్‌కు ఈసారి ఎన్నికలు గట్టి దెబ్బే కొట్టబోతున్నాయి. చుట్టూ వ్యతిరేకతే. ఎలా బయటపడాలో అర్థం కాని పరిస్థితి. చెల్లెళ్ల మొదలు పార్టీలన్నీ వ్యతిరేకమే.. సింహం సింగిల్ అంటూ వైసీపీ కబుర్లు చెబుతోంది కానీ అసలు ఆ పార్టీతో కలిసి నడిచేందుకు ఒక్కటంటే ఒక్క పార్టీ కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. చివరకు బీజేపీని వ్యతిరేకించే మిత్రపక్షాలు సైతం వైసీపీ వైపు కూడా చూడటం లేదు. ఇంతటి దయనీయ పరిస్థితి దేశంలోనే నభూతో.. నభవిష్యత్.