విశ్వక్ సేన్ లేటెస్ట్ చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత సరికొత్త పాయింట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం గత శుక్రవారం రిలీజ్ అయ్యింది. మహా శివరాత్రి స్పెషల్ గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా విజువల్స్ వండర్‌ఫుల్‌గా ఉన్నాయని నెటిజన్స్ రివ్యూలు ఇచ్చారు.
అలాగే గామిలో నరేష్ కుమారన్ అందించిన సంగీతం, బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయంటూ ఆడియన్స్ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో గామి ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. గామి ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 (ZEE5) కొనుగోలు చేసింది. గామి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు భారీగానే పోటీ పడినట్లు సమాచారం. వాటన్నింటిని దాటుకుని ఫైనల్‌గా ఫ్యాన్సీ రేటుని వెచ్చించి గామి ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుందట.
థియేటర్స్ లో విడుదలై నెల రోజులకి గామి చిత్రాన్ని జీ 5 ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే మార్చి 8 న విడుదలైన ఈ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ ఓటీటీ ఆడియన్స్ ముందు రావొచ్చన్నమాట.