గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గత నెల గోవాలో ప్రేమించిన జాకీ భగ్నానీని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. గోవా వేదికగా రకుల్-జాకీ భగ్నానీల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ సెలబ్రిటీస్, రకుల్ కుటుంభ సభ్యులు, జాకీ భగ్నానీ ఫ్యామిలీ మెంబెర్స్, సన్నిహితుల మధ్యన గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ ఆ తర్వాత భర్తతో కలిసి ముంబై లో అడుగుపెట్టింది. హానిమూన్ ఊసులేకుండా జాకీ ఫ్యామిలీ మెంబెర్స్, రకుల్ ఫ్యామిలీతో ఆమె ఈమధ్యనే కామాఖ్య దేవి గుడి ని సందర్శించి స్పెషల్ పూజలు నిర్వహించింది.
ఇక పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టకుండా నటనని కంటిన్యూ చేస్తుంది అన్నట్లుగా రకుల్ తీరు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్పెషల్ ఫోటో షూట్స్ వదులుతుంది. సౌత్ లో ఇండియన్ 2 అలాగే హిందీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటున్న రకుల్ సోషల్ మీడియాని మాత్రం వదలదు. అందులో కోత్త కొత్త ఫోటో షూట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా రకుల్ ఓ ఫోటో షూట్ షేర్ చేసింది. కొత్త పెళ్లి కూతురుగా అంటే చేతులకి మెహిందీ పోకుండానే ఈ ఫోటో షూట్ చేసినట్టుగా కనిపిస్తుంది.
రకుల్ మొహంలోనూ పెళ్లి కళ ఇంకా పోలేదు. అంటే పెళ్లయిన వారంలోపే రకుల్ ఈ ఫొటోస్ తీయించుకున్నట్టుగా అనిపిస్తుంది. చేతుల నిండా పెళ్ళి గాజులు, చేతులకి గోరింటాకు, అన్ని రకుల్ పెళ్లి కూతురు గెటప్ ని గుర్తుకు తెస్తున్నాయి. అందుకే ఈ ఫోటొస్ చూడగానే కొత్త పెళ్లికూతురు రకుల్ లేటెస్ట్ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.