మెగాస్టార్ చిరంజీవి-వసిష్ఠ కాంబోలో యువి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం విశ్వంభర. ఈ చిత్రం షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది. మెగాస్టార్ కి సిస్టర్స్ కేరెక్టర్స్ లో ఇషా చావ్లా, సురభి నటిస్తుండగా వాళ్ళ జోడిల కోసం వసిష్ఠ వెతుకులాటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో త్రిష చాలా ఏళ్ళ తర్వాత మెగాస్టార్ తో జోడి కట్టబోతుంది. ఇప్పటికే చిరు-త్రిష ల కాంబోలో ఓ బ్యూటిఫుల్ సాంగ్ ని తెరకెక్కించినట్లుగా సమాచారం.
2025 సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతున్న విశ్వంభర చిత్ర బృందంలో ఓ మెగా మార్పు చోటు చేసుకుంది అని తెలుస్తోంది. విశ్వంభరకి డైలాగ్ రైటర్ గా పని చేస్తోన్న సాయిమాధవ్ బుర్రా టీమ్ నుంచి తప్పుకొన్నారు అని, ఆయన స్థానంలోకి మరో రైటర్ రాబోతున్నారట. అయితే ఆయన ఎవరు, అసలు బుర్ర సాయి మాధవ్ ఎందుకు ఈ మెగా ప్రాజెక్ట్ నుంచి తప్పున్నారో అనే గుసగుసలు మొదలయ్యాయి.
ఎందుకంటే సాయిమాధవ్ బుర్ర రాసిన కొన్ని డైలాగ్స్ తో ఇప్పటికే వసిష్ఠ కొన్ని సన్నివేశాలని షూటింగ్ చేసారు. మరి ఇప్పుడు ఆయన వెళ్లిపోయారు. ఇకపై వచ్చే కొత్త రచయిత విశ్వంభరకు ఎలాంటి ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ రాస్తారో అంటున్నారు.