బాలీవుడ్ మీడియాలోనే కాదు సోషల్ మీడియాలోనూ తెగ ట్రెండ్ అవుతున్న సౌత్ బ్యూటిఫుల్ గర్ల్ రాశి ఖన్నా. సౌత్ లో స్టార్ స్టేటస్ అందుకోలేకపోయిన రాశి ఖన్నా ఇప్పుడు తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పై పెట్టింది. అక్కడ ఫార్జి వెబ్ సీరీస్ తో సక్సెస్ అందుకున్న రాశి యోధా తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రం విజయం సాధిస్తుంది అని నమ్ముతోంది. యోధా ప్రమోషన్స్ లో భాగంగా రాశి ఖన్నా గ్లామర్ షో తెగ హైలెట్ అవుతుంది.
అదిరిపోయే మోడ్రెన్ అవుట్ ఫిట్స్ తో రాశి ఖన్నా తరచూ సోషల్ మీడియాని ఊపేస్తోంది. బొద్దు భామ చిక్కినా అందమే అన్నట్టుగా నాజూగ్గా తయారయ్యాక గ్లామర్ షో ని మరికాస్త పెంచిన రాశి ఖన్నా మెరుపులు ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే.. వావ్ అంటారేమో. ఆక్వా బ్లూ డ్రెస్ లో రాశి ఖన్నా సొగసులు నెట్టింట సంచలనంగా మారాయి.
రాశి ఖన్నా కొత్త గ్లామర్ లుక్ చూసి యూత్ అయితే ఫిదా అవుతుంది. రాశి ఖన్నా ఈ లేటెస్ట్ అందాలను మీరూ ఓ లుక్కెయ్యండి.