పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని బాగా డిస్పాయింట్ చేసారుగా.. హరి హర వీరమల్లు మేకర్స్. ఎప్పుడో ఏడాదిన్నర క్రితమే షూటింగ్ ఆగిపోయిన హరి హర వీరమల్లు నుంచి మహాశివరాత్రికి స్పెషల్ ట్రీట్ ఉండబోతుంది.. పవన్ కళ్యాణ్ యాక్షన్ తో కూడుకున్న హరి హర వీరమల్లు టీజర్ ని శివరాత్రికి వదలబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి పవన్ కళ్యాణ్ ఫాన్స్ చాలా ఎగ్జైట్ అవుతూ శివరాత్రి రాక కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని కూర్చున్నారు.
మరి శివరాత్రి వచ్చింది, వెళ్ళింది. కానీ హరి హర వీరమల్లు నుంచి ఎటువంటి అప్ డేట్ రాలేదు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్న హరి హర వీరమల్లు ని పవన్ ఆపేశారనే టాక్ నడుస్తుంది. క్రేజీ పిరియాడికల్ డ్రామాగా మొదలైన ఈ చిత్ర షూటింగ్ 75 శాతం పూర్తయ్యింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తిరగడంతో షూటింగ్ ని పక్కనబెట్టాల్సి వచ్చినా.. ఆ తర్వాత పవన్ రెండు మూడు సినిమాల షూటింగ్ లలో పాల్గొన్నా హరి హర వీరమల్లు ఊసు ఎత్తలేదు.
అందుకే హరి హర వీరమల్లు ని పక్కన పెట్టేసారు, ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లే అన్నారు. అయితే శివరాత్రి వస్తుంది అనగానే మేకర్స్ కూడా గాసిప్స్ క్రియేట్ చేసి వదలడంతో పవన్ ఫాన్స్ ఉత్సాహపడ్డారు. ఇప్పుడు శివరాత్రికి హరి హర వీరమల్లు అప్ డేట్ లేకపోయేసరికి వారు బాగా డిస్పాయింట్ అయ్యారు.