Advertisementt

మనసు గాయంపై సమంత కామెంట్స్ వైరల్

Fri 08th Mar 2024 09:46 PM
samantha ruth prabhu  మనసు గాయంపై సమంత కామెంట్స్ వైరల్
Samantha comments on mental trauma go viral మనసు గాయంపై సమంత కామెంట్స్ వైరల్
Advertisement
Ads by CJ

సమంత అక్కినేని ఇంటి కోడలిగా, నాగ చైతన్యకి భార్యగా ఆ ఇంట్లో అడుగుపెట్టాక సమంత అంత అదృష్టం ఎవ్వరికి రాదు అనుకున్నారు. కానీ ఆ అదృష్టం ఎక్కువ కాలం నిలవలేదు. సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకుని విడిపోయారు. సమంత మానసికంగా నలిగిపోయింది. అందులో నుంచి బయటపడేందుకు ఆధ్యాత్మికత, వర్కౌట్స్, స్నేహితులతో వెకేషన్స్ అంటూ తిరిగింది. ఇక సమంత లైఫ్ లో ఆ స్ట్రగుల్స్ ముగిసిపోయి తన పనిలో తాను బిజీగా వున్న సమయంలో మాయోసైటిస్ ఆమెని మరింతగా కుంగ దీసింది.

ప్రస్తుతం నటనకి బిగ్ బ్రేకిచ్చి హెల్త్ పై కేర్ తీసుకుంటున్న సమంత.. మళ్ళీ షూటింగ్ లకి రెడీ అయ్యింది. తాజాగా ఫెమినా ఫోటో షూట్ కోసం సమంత గ్లామర్ పరంగా హద్దులు దాటేసింది అనే కామెంట్స్ వినిపించాయి. అయితే తాజాగా సమంత ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. తాను అభద్రతా భావానికి గురవుతున్నాననే విషయాన్ని గ్రహించగలిగానని.. తర్వాత దాని నుంచి బయటకు వచ్చానని చెప్పిన సమంత.. బయటకు కనిపించే గాయాలకంటే మనసుకైన గాయం నుంచి కోలుకోవడానికే ఎక్కువ సమయం పడుతుందని చెప్పింది. 

అయితే మనపై మనకున్న ఆత్మవిశ్వాసమే మనం గొప్ప వ్యక్తిగా ఎదగడానికి ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చింది. సమంత రీసెంట్ గా తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుని వచ్చింది. ఇకపై ఆమె నటించబోయే ప్రాజెక్ట్స్ ఏమిటో అని ఆమె అభిమానులు క్రేజీగా ఎదురు చూస్తున్నారు.

Samantha comments on mental trauma go viral:

Samantha Ruth Prabhu opens up about dealing with low confidence

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ