కొన్ని చిత్రాలు థియేటర్స్ కి వచ్చేముందు ప్రమోషన్స్ తో సందడి చేస్తూ ప్రేక్షకులని ఆకట్టుకునేలా వస్తాయి. బాక్సాఫీసు దగ్గర ఓ మాదిరిగా ఆడిన తర్వాత నెలకి ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వాల్సిన చిత్రాలు ఎలాంటి హడావిడి లేకుండా 20 రోజులకే ఓటిటిలోకి వస్తే.. అవి ఓటిటీ ఆడియన్స్ కి ఎలా రీచ్ అవుతాయి. ముందస్తు ప్రకటనలు కూడా ఇవ్వకుండానే ట్విస్ట్ అంటూ ఓటిటిలో ప్రత్యక్షమైతే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు.
ఇప్పడు అలానే రెండుమూడు చిత్రాలు ఎలాంటి సందడి చెయ్యకుండా ఓటిటిలో ప్రత్యక్షమయ్యాయి. అదే సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోన, విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్ చిత్రాలు. మహాశివరాత్రి సందర్భంగా ఓటిటిలోకి స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. తేజ సజ్జా హనుమాన్ కూడా ఈరోజే స్ట్రీమింగ్ అన్నప్పటికీ అది కానరాలేదు. ఫిబ్రవరి 16 న థియేటర్స్ లో విడుదలైన ఊరు పేరు భైరవ కోన 21 రోజులు గడవకముందే అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్షమైంది.
థియేటర్స్ లో పర్వాలేదనిపించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని అమెజాన్ ప్రైమ్ వారు ఎలాంటి ప్రకటన చెయ్యకుండానే సైలెంట్ గా ఓటిటిలోకి తెచ్చేసారు. గత అర్ధరాత్రి నుంచి ఊరు పేరు అమెజాన్ ప్రైమ్ నుంచి అందుబాటులోకి వచ్చేసింది. విజయ్ సేతుపతి-కత్రినా కైఫ్ ల మేరీ క్రిస్మస్ కూడా నెట్ ఫ్లిక్స్ నుంచి హడావిడి ఏమి లేకుండానే స్ట్రీమింగ్ అవుతోంది.
ఏ పోస్టారో రిలీజ్ చేసి ఆయా సినిమాలు ఓటిటిలోకి వస్తున్న విషయాన్ని ప్రేక్షకులకి చేరవేస్తే.. ఆ చిత్రానికి వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఆ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ఎప్పుడు గ్రహిస్తుందో మరి.