మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రేమలు చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ తెలుగులో రిలీజ్ చెయ్యడంతో అందరి చూపు ఈ చిత్రంపైనే పడింది. నిన్న మార్చ్ 7 నే ప్రేమలు పెయిడ్ ప్రీమియర్స్ తోనే సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం మళయాళంలోనే కాదు తెలుగులోనూ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుంది అని పెయిడ్ ప్రీమియర్స్ తోనే క్లారిటీ వచ్చేసింది. నేడు మహా శివరాత్రి స్పెషల్ గా గోపీచంద్ భీమా, విశ్వక్ సేన్ గామి ఇంకొన్ని చిన్న చిత్రాలతో పోటీపడి మరీ బాక్సాఫీసు దగ్గర సందడి చేస్తుంది ప్రేమలు. మరి ప్రేమలు ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందో చూద్దాం..
ప్రేమలు చిత్రాన్ని ప్రీమియర్స్ వీక్షించిన ఓ ప్రేక్షకుడు సినిమా ఎలా ఉందో సోషల్ మీడియాలో ఇలా ట్వీట్ చేసాడు..
లవ్ స్టోరీస్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది..
ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు.. తెలిసిన కథే అయినా ఇంట్రెస్ట్ తగ్గదు..
ప్రేమలు సినిమా కూడా ఇదే.. బోర్ కొట్టకుండా అలా సరదాగా వెళ్ళిపోతుంది..
ఇది మనం ఎప్పుడూ చూడని కథ కాదు.. మనకు తెలియని కథ కూడా కాదు..
ఒక మామూలు సాదాసీదా ప్రేమ కథ..
ఆవారా కుర్రాడు, సాఫ్ట్ వేర్ అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీ..
దీన్నే దర్శకుడు గిరీష్ ఎక్కడా బోర్ కొట్టకుండా సూపర్ స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టించాడు..
మామూలుగా మలయాళం డబ్బింగ్ సినిమాలు చూసేటప్పుడు నేటివిటీ ఇష్యూ వస్తుంది..
ప్రేమలు సినిమాకు ఆ కంప్లైంట్ కూడా లేదు..
కథ మొదటి నుంచి చివరి వరకు హైదరాబాద్ లోనే సాగుతుంది కాబట్టి..
ఎక్కడా మనకు అనువాద సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు..
దానికి తోడు ట్రోలింగ్ లో ఉన్న అన్ని మాటల్ని డైలాగులుగా వాడేసారు..
హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి..
సిట్యుయేషనల్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది..
ఫస్టాఫ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది..
సెకండాఫ్ అక్కడక్కడ బ్రేకులు పడినట్టు అనిపించిన బోర్ కొట్టదు..
సచిన్ పాత్రలో నెస్లన్ అద్భుతంగా నటించాడు..
ఇక సినిమాకు మెయిన్ అట్రాక్షన్ హీరోయిన్ మమిత బైజు..
సింపుల్ స్టోరీని స్క్రీన్ మీద అద్భుతంగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు గిరీష్..
ఈమద్య ప్రేమ సినిమాలు లేవు..
ఓవరాల్ గా ప్రేమలు..
ఈ వీకెండ్ కు పర్ఫెక్ట్ ఛాయిస్..