Advertisementt

ఏంటి సమంత ఈ అవతారం

Fri 08th Mar 2024 09:40 AM
samantha  ఏంటి సమంత ఈ అవతారం
Samantha sizzles for Femina ఏంటి సమంత ఈ అవతారం
Advertisement
Ads by CJ

నటనకు బిగ్ బ్రేకిచ్చినా.. సోషల్ మీడియాని వదలని సమంత ఇప్పుడు నటనకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. తాను నటనకు సిద్దమనే సంకేతాలు పంపుతూనే ఉంది. రీసెంట్ గా సమంతకి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది అనే ప్రచారం జరిగినా ఆ విషయంలో క్లారిటీ లేదు. అదలా ఉంటే సమంత లుక్స్ విషయంలో కొద్దిరోజులుగా ఆమెపై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. సమంత లుక్స్, ఆమె మొహంలో గ్లో అన్ని పోయాయి అంటూ విమర్శించని వారు లేరు.

అయితే ఈమధ్యన మళ్ళీ మెరుపులు మెరిపిస్తూ నవ్వుతూ సమంత కొత్త హుషారుతో కనిపించింది. దానితో సమంత మునుపుటి గ్లో తెచ్చుతుంది అనుకున్నారు. కాని సమంత ఇప్పుడు ఫెమినా మ్యాగజైన్ కోసం చేయించుకున్న ఫోటో షూట్ చూస్తే వామ్మో సమంత ఏంటి ఇలా తయారైంది అంటారు. సమంత ని ఈ పిక్స్ లో గుర్తుకూడా పట్టలేరు, సన్నగా ఉండడం అటుంచి లుక్స్ పరంగా సమంత ని చూసి ఏమిటి అవతారం అనకమానరు. ఫేస్ లో గ్లో లేకపోవడమే కాదు, అసలు సమంత స్టయిల్ చూసాక ఈమె సమంతనేనా అంటారు.

క్యూట్ గా స్వీట్ గా కనిపించే సమంత ఇప్పుడు ఈ అవతారంలో కనిపించేసరికి ఆమె అభిమానులే షాకవుతున్నారు. గ్లామర్ చూపించడం పక్కనబెట్టండి.. ఆమె అంత బద్ద లాగా సన్నగా అందవిహీనంగా ఉంది అనే కామెంట్స్ మాత్రం గట్టిగా రేజ్ చేస్తున్నారు. కుదురుగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసుసుకోక..  సమంత కి ఇవన్నీ అవసరమా అంటూ సలహాలు ఇచ్చేవారు లేకపోలేదు. 

Samantha sizzles for Femina:

Femina Features Samantha

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ