ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కలయికలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన తర్వాత సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన హనుమాన్ చిత్రం ఓటిటీ స్ట్రీమింగ్ డేట్ పై మాత్రం ఇంకా ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. జనవరి 12 న విడుదలైన హనుమాన్ చిత్రం ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ అవుతుంది అనుకుంటే లేదు. సరే థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. మరో నెల వెయిట్ చేసారు. హనుమాన్ ఓటిటీ హక్కులు దక్కించుకున్న జీ 5 కూడా మేకర్స్ అనుమతి కోసం వెయిట్ చేస్తుంది.
ఇక మహా శివరాత్రి మార్చ్ 8 న హనుమాన్ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. చాలామంది యూత్ కూడా థియేటర్స్ లో హనుమాన్ ని చూసి మళ్ళీ ఓటిటిలో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు అంటే.. హనుమాన్ క్రేజ్ ఎలా ఉందో చెప్పుకోవాలి. కానీ మహాశివత్రి కి కూడా హనుమాన్ స్ట్రీమింగ్ లేనట్లే. దానితో కొంతమంది ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా జీ 5 ని ట్యాగ్ చేస్తూ హనుమాన్ స్ట్రీమింగ్ తేదీపై నిలదీశారు.
దానికి రిప్లై ఇచ్చిన జీ 5 ఇంతవరకు మాకే హనుమాన్ ఓటిటీ తేదీపై ఎలాంటి అప్ డేట్ లేదు అంటూ చావు కబురు చల్లగా చెప్పింది. దానితో హనుమాన్ లవర్స్ బాగా డిస్పాయింట్ అవుతున్నారు.