మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ తర్వాత జర్మనీకి వెళ్లొచ్చారు. అప్పుడు ఎయిర్ పోర్ట్ లో కనిపించడం మినహా మహేష్ బాబు కొద్దిరోజులుగా బయట ఎక్కడా కనిపించడం లేదు. కనిపించినా హెయిర్ ని క్యాప్ తో కళ్ళని కూలింగ్ గ్లాసెస్ తో కవర్ చేస్తున్నారు తప్ప ఆయన ఫేస్ ని ప్రోపర్ గా చూపించడం లేదు. అసలు మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి తో చెయ్యాల్సిన SSMB29 చిత్రం కోసం రెడీ అవుతున్నారు. జిమ్ లో వర్కౌట్స్, లుక్ టెస్ట్ కోసం మేకోవర్ అబ్బో మహేష్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి
మరోపక్క లుక్ టెస్ట్ అయ్యేవరకు మహేష్ బయట కనిపించరనే వార్త చూసాక మహేష్ అభిమానులు బెంగపెట్టేసుకున్నారు. అయితే మహేష్ బాబు తాజాగా తన కొత్త లుక్ ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో రివీల్ చేసారు. Laser focus! అంటూ మహేష్ ఆ పిక్ కి క్యాప్షన్ కూడా పెట్టారు. మహేష్ బాబు కొత్త లుక్ చూస్తే ఎప్పటిలాగే హ్యాండ్ సమ్, పాల బుగ్గల పసివాడు, అమేజింగ్, అద్భుతం, ఈవయసులో ఇంటిలాంటి మెయింటినెన్స్ మహేష్ కే సాధ్యం, ఏమున్నాడురా అంటూ కామెంట్స్ మొదలు పెట్టేసారు.
మహేష్ లుక్ చూసాక అభిమానులైతే హ్యాపీ గా ఫీలైపోతున్నారు. మరి మహేష్-రాజమౌళి కలిసి ఎప్పుడు కనిపిస్తారో.. ఆ SSMB29 ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందో అనేది తెలిస్తే వాళ్ళు అస్సలాగరేమో..!