స్టార్ హీరోలెవరైనా ఆసుపత్రిలో కనిపిస్తే చాలు వాళ్ళ అభిమానులు తెగ ఆందోళన పడిపోతారు. తమ హీరోకి ఏమైందో ఏమో అనే కంగారులో పూజలు చేస్తూ దేవుడికి మొరపెట్టుకుంటారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో ఒకరు చెన్నై ఆసుపత్రిలో కనిపించారో లేదో.. ఆయన అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఆయనే హీరో అజిత్. అజిత్ చెన్నైలోని ప్రముఖ ప్రవేట్ ఆసుపత్రిలో కనిపించిన వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా ఆయన అభిమానులు అజిత్ కి ఏమైందో ఏమో అనే ఆందోళన పడిపోయారు.
అయితే అజిత్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కోసమే చెన్నై లోని ఆసుపత్రికి వెళ్ళి అక్కడ హెల్త్ చెకప్స్ చేయించుకున్నారని, త్వరలోనే అజిత్ నటిస్తున్న విడాయమర్చి చిత్ర షూటింగ్ కోసం అజిత్ విదేశాలకి వెళ్లాల్సి రావడంతో ఆయన ఈ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడానికి వెళ్లారట. ఈ విషయం తెలియని అభిమానులు ఆందోళన పడుతూ అజిత్ త్వరగా కోలుకోవాలంటూ పూజలు గట్రా మొదలు పెట్టారు. కానీ అజిత్ రొటీన్ హెల్త్ చెకప్ కి వెళ్లారని తెలిసి వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారు.