Advertisementt

భక్తి పారవశ్యంలో రకుల్ జంట

Thu 07th Mar 2024 04:08 PM
rakul preet singh  భక్తి పారవశ్యంలో రకుల్ జంట
Rakul-Jackky visits Kamakhya Devi Temple భక్తి పారవశ్యంలో రకుల్ జంట
Advertisement
Ads by CJ

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గత నెల ప్రేమించిన ప్రియుడు జాకీ భగ్నానీని పెద్దల అంగీకారంతో గోవా వేదికగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. రకుల్ ప్రీత్ బాలీవుడ్ లో బిజీగా వున్నా.. ఆమెకి సౌత్ లో అవకాశాలు సన్నగిల్లడంతో ఫైనల్ గా రకుల్ మూడు మూళ్ళ బంధంలోకి అడుగుపెట్టింది. రకుల్ ప్రీత్ పెళ్లి గోవాలో నలుగురు మాట్లాడుకునేలా గ్రాండ్ గా జరిగిపోయింది. ఆమె హల్దీ సెర్మోని, సంగీత్, మెహిందీ వేడుకలు అలాగే పెళ్లి అన్నీ అద్భుతంగా జరిగినట్టుగా సోషల్ మీడియాలో వాళ్ళు వదిలిన వీడియోస్ చూస్తే అర్ధమవుతుంది.

పెళ్ళికి ముందు రకుల్ ఆమె బాయ్ ఫ్రెండ్ ఎక్కడ కనిపించినా క్లిక్ మనిపించే ఫోటో గ్రాఫర్స్ పెళ్లి తర్వాత కూడా ఈ కొత్త జంటని ఫోటోలు తియ్యడం ఆపడం లేదు. గోవాలో పెళ్లి వేడుకలు ముగియగానే ముంబై లో అడుగుపెట్టిన రకుల్ జంట ఓ పది రోజుల గ్యాప్ తో మళ్ళీ ఓ గుడిలో భక్తి పారవశ్యంలో కనిపించింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన భర్త జాకీ భగ్నానీ తో కలిసి అత్యంత ప్రాచీనమైన కామాఖ్య దేవాలయం లో కొలువై ఉన్న కామాఖ్య దేవి అమ్మవారిని దర్శించుకుంది.

కామాఖ్యదేవి ఆలయ సందర్శనకి వచ్చిన రకుల్, జాకీ భగ్నానీలతో పాటుగా వారి వారి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇక రకుల్ పెళ్లి తర్వాత కూడా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టననే సిగ్నల్స్ తరచూ సోషల్ మీడియా ద్వారా అందిస్తూనే ఉంది. 

Rakul-Jackky visits Kamakhya Devi Temple:

 Rakul Preet Singh and Jackky Bhagnani spiritual journey at the Kamakhya Temple in Assam

Tags:   RAKUL PREET SINGH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ