Advertisementt

విక్రమార్కుడు 2 రాబోతుంది

Thu 07th Mar 2024 03:42 PM
vikramarkudu  విక్రమార్కుడు 2 రాబోతుంది
Vikramarkudu sequel on cards విక్రమార్కుడు 2 రాబోతుంది
Advertisement
Ads by CJ

రాజమౌళి రవితేజని హీరోగా పెట్టి విక్రమార్కుడు మూవీని తెరకెక్కిస్తే అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. రవితేజని డ్యూయెల్ రోల్ లో చూపించగా ఓ కేరెక్టర్ ని పోలీస్ గా మరో కేరెక్టర్ ని దొంగగా చూపించిన రాజమౌళి ఆ ఇద్దరి కలయికలో ఎమోషన్స్ పండేలా ప్లాన్ చేసి ప్రేక్షకుడితో కంట తడి పెట్టించారు. ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన చిత్రంగా, రవితేజ మాస్ ఇమేజ్ ని కూడా ఆకాశానికి తీసుకెళ్లిన చిత్రంగా నిలవగా అనుష్క ఈ చిత్రంతో ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకుంది.

ఇలాంటి విక్రర్కుడు చిత్రానికి సీక్వెల్ రాబోతుంది అనగానే అందరికి గూస్ బమ్స్ వచ్చినంత పనయ్యింది. నిర్మాత కేకే రాధా మోహన్ భీమా ప్రమోషన్స్ లో భాగంగా అసలు విక్రమార్కుడు 2 ఉందా లేదా అనే దానిపై సాలిడ్ అప్డేట్ అందించారు. విక్రమార్కుడు 2 కథ సిద్ధంగా ఉందని అయితే ఈ సినిమాకి రవితేజ గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సూపర్ ఎగ్జైటింగ్ న్యూస్ అందించారు. రవితేజకి విక్రమార్కుడు సీక్వెల్ పై అంత ఇంట్రెస్ట్ లేకపోయింది, కానీ తాను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా చెప్పారు. 

అయితే ఈ సీక్వెల్ కి రాజమౌళి దర్శకుడు కాదని, కథ విజయేంద్ర ప్రసాద్ గారే అందిస్తున్నారు, సంపత్ డైరెక్ట్ చేస్తాడని కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ విక్రమార్కుడు 2 టైటిల్ కూడా రిజిస్టర్ చేయించినట్లుగా చెప్పి మరింత క్యూరియాసిటీ ని ఈ ప్రాజెక్ట్ పై పెంచేసారాయన. 

Vikramarkudu sequel on cards:

Vikramarkudu sequel awaiting for Ravi Teja nod

Tags:   VIKRAMARKUDU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ