Advertisementt

పుష్ప2 ని లైట్ తీసుకుంటున్నారా?

Thu 07th Mar 2024 12:29 PM
allu arjun  పుష్ప2 ని లైట్ తీసుకుంటున్నారా?
Pushpa 2 vs GOAT పుష్ప2 ని లైట్ తీసుకుంటున్నారా?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ పుష్ప ద రైజ్ తో ఎంత పెద్ద హిట్ కొట్టాడో, సోలో గా ప్యాన్ ఇండియా మార్కెట్ లో అల్లు అర్జున్ స్టామినా ఏమిటో పుష్ప తో నిరూపించుకున్నాడు. అంతేకాకుండా నేషనల్ అవార్డు గెలుచుకుని తన రేంజ్ మరోసారి చూపించాడు. మరి ఇప్పుడు పుష్ప కి సీక్వెల్ గా పుష్ప ద రూల్ తో రాబోతున్నాడు. అంటే అల్లు అర్జున్ తో ఢీ కొట్టడానికీ ఎవరూ ఆలోచించరు, సిద్ధమూ అవ్వరు. సుకుమార్-అల్లు అర్జున్ పుష్ప ద రూల్ పై ప్యాన్ ఇండియా మార్కెట్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ఆగష్టు 15 న విడుదల కాబోతున్న పుష్ప ద రూల్ తో పోటీపడేందుకు ఏ స్టార్ హీరో ఆలోచించరనే అనుకున్నారు. కాని ఇప్పుడు పుష్ప ద రూల్ ని లైట్ తీసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అజయ్ దేవగన్ మల్టీస్టారర్ సింగం అగైన్ ని అదే డేట్ కి దింపాలనే లక్ష్యంతో దర్శకుడు రోహిత్ శెట్టి పని చేస్తున్నారు. మరోపక్క  వెంకట్ ప్రభు డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం చిత్రాన్ని కూడా ఆగస్టు 15 కే విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. GOAT కి సంబంధించి ఒక విదేశీ షెడ్యూల్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.

మే కల్లా పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఆగష్టు 15 కి విడుదల చేస్తే బావుంటుంది అనుకుంటున్నారట. ఈ చిత్రం తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాల్లో యాక్టీవ్ అవుతారు. మరి అజయ్ దేవగన్ కి సౌత్ లో అంతగా క్రేజ్ లేదు, అటు విజయ్ కి నార్త్ లో ఇంకా పట్టు దొరకలేదు. అయినా పుష్ప తో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. మరోపక్క పుష్ప 2 ఆగష్టు 15 నుంచి పోస్ట్ పోన్ అయితే గనక ఈ చిత్రాలకి కలిసొస్తుంది. అటువంటి వార్తలు చూసాకే వీరు ఆగష్టు 15 కె కచ్చిఫ్ వేసే ఆలోచనలో ఉన్నారట.

Pushpa 2 vs GOAT:

Allu Arjun Pushpa 2 vs Vijay GOAT

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ