అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో క్రేజీ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప ద రైజ్ కి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప ద రూల్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. అల్లు అర్జున్ ఇంకా కొంతమంది ఆర్టిస్ట్ లపై ఓ పాటని సుకుమార్ చిత్రీకరిస్తుండగా.. తర్వాత చిత్ర బృందం పుష్ప లోని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం వైజాగ్ వెళ్ళబోతోంది. ఈలోపులో పుష్ప 2 షూటింగ్ స్పాట్ నుంచి సుకుమార్ తెరకెక్కిస్తున్న సాంగ్ లీక్ అయ్యింది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పుష్ప ద రూల్ లో అల్లు అర్జున్ పై చిత్రీకరించిన సాంగ్ బిట్ లీకయ్యింది అంటూ ప్రచారం జరగడం కాదు.. ఆ సాంగ్ బిట్ ని సోషల్ మీడియాలో కొంతమంది ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ పాట లీక్ పై చిత్ర బృందం ఫన్నీగా స్పందించింది. పుష్ప 2 సాంగ్ లీకైంది అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, అదో ఫ్యాన్ మేడ్ సాంగ్, దీనికి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ చెప్పడంతో అల్లు అభిమానులు రిలాక్స్ అవుతున్నారు. వాళ్ళు సాంగ్ లీక్ అనగానే ఎందుకంత టెన్షన్ పడ్డారు అంటే.. ఇంతకు ముందు పుష్ప 2 నుంచి కొన్ని సీన్స్ లీకై సెన్సేషన్ క్రియేట్ చేసాయి.
అందుకే ఇప్పుడు ఈ సాంగ్ కూడా ఎక్కడ లీకైందో అని కంగారు పడ్డారు. కానీ చిత్ర బృందం అది ప్యాన్ మేడ్ సాంగ్ అనేసరికి వారు రిలాక్స్ అవుతున్నారు. పుష్ప ద రూల్ చిత్రం ఆగస్ట్ 15న గ్రాండ్ గా సినిమా రిలీజ్ కాబోతోంది.