జూనియర్ ఎన్టీఆర్ కి కొడాలి నాని సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం ఎన్టీఆర్-నాని ఎక్కువగా క్లోజ్ గా కలిసి కనిపించేవారు. కానీ నాని వైసీపీ లోకి వెళ్ళాక ఎన్టీఆర్-నాని కలిసి కనిపించడం లేదు. ఇటు ఎన్టీఆర్ టీడీపీ తో మింగిల్ అవ్వడం లేదు. చంద్రబాబు, బాలకృష్ణలు ఎన్టీఆర్ ని దూరం జరుపుతున్నారు. ఒకప్పుడు ఎలెక్షన్స్ లో ఎన్టీఆర్ చేత పబ్లిసిటీ చేయించుకున్న చంద్రబాబు తన కొడుకు లోకేష్ ని హైలెట్ చేసేందుకు ఎన్టీఆర్ ని తొక్కేస్తున్నారనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది.
ఎన్టీఆర్ కూడా నాకెందుకు అని సినిమాలు చేసుకుంటూ రాజకీయాలకి దూరంగా ఉంటున్నాడు. కానీ టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ని మళ్ళీ పార్టీలోకి తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క తన మేనల్లుడు ఎన్టీఆర్ ని వదిలేసి చంద్రబాబు పవన్ భజన చేస్తున్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తాజాగా కొడాలి నాని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్ లు ఎన్టీఆర్ ని ఇబ్బంది పెడుతున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.
ఈసారి ఎన్నికల్లో లోకేష్, చంద్రబాబును గెలిపిస్తే జూనియర్ NTR ను పార్టీలో నుండి బయటకు తోసేస్తారు. పుట్టినరోజుకి, చావుకు తేడా తెలియని లోకేష్ ను సీఎం చేయాలని... జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేసి, అనేక ఇబ్బందులు పెడుతున్నారు.. అంటూ సంచలనంగా మాట్లాడాడు. కొడాలి నాని ఎప్పుడూ ఈ రకమైన కామెంట్స్ చేస్తూనే ఉంటాడు. చంద్రబాబు, లోకేష్ ల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఒక్కోసారి ఎన్టీఆర్ ని మధ్యలోకి లాగి పబ్బం గడుపుకుంటాడు, ఇవన్నీ నమ్మకండి, ఫ్యామిలిలో చీలికలు తీసుకురావడానికే కొడాలి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడు అంటూ టీడీపీ నేతలు కార్యకర్తలకి సర్దిచెబుతున్నారు.