ఈరోజు మార్చ్ 6 అల్లు అర్జున్-స్నేహ రెడ్డిల వెడ్డింగ్ యానివర్సరీ. వారికి పెళ్ళై 13 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ 13 ఏళ్ళుగా అల్లు అర్జున్ తన భార్య స్నేహతో ఎంతో అన్యోన్యంగా, ఆమెకి సమయాన్ని కేటాయిస్తూ టైమ్ దొరికినప్పుడల్లా స్నేహతో కలిసి వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటూ.. పిల్లలు ఆయన్, అర్హలకి మంచి తండ్రిగా అల్లు అర్జున్ పూర్తి ఫ్యామిలీ మ్యాన్ లా కనిపించారు. స్నేహ రెడ్డి కూడా స్టైలిష్ స్టార్ కి తగ్గ స్టైలింగ్ ని మైంటైన్ చేస్తూ అల్లు ఫ్యామిలీ కోడలి బాధ్యతలని నిర్వర్తిస్తుంది.
పెళ్లి రోజునాడు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిని క్యూట్ గా విష్ చేసాడు. మనకు పెళ్ళై 13 ఏళ్ళు దాటిపోయింది. నేను ఇప్పుడు ఇలా ఉండడానికి నీ బంధమే కారణం. నీ ప్రశాంతత నుంచి నాకు బోలెడంత శక్తినిచ్చావ్. మరెన్నో వార్షికోత్సవాలు ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను, హ్యాపీ యానివర్సరీ క్యూటీ అంటూ అల్లు అర్జున్ తన భార్యతో కలసి ఉన్న అందమైన ఫోటోని షేర్ చేస్తూ భార్యకి వెడ్డింగ్ డే విషెస్ ని తెలియజేసాడు.