Advertisementt

మహేష్ లుక్ కోసం రాజమౌళి కష్టాలు

Wed 06th Mar 2024 10:40 AM
mahesh babu u  మహేష్ లుక్ కోసం రాజమౌళి కష్టాలు
Rajamouli struggles for Mahesh look మహేష్ లుక్ కోసం రాజమౌళి కష్టాలు
Advertisement
Ads by CJ

దర్శకధీరుడు రాజమౌళి తో మహేష్ బాబు సినిమా అనగానే.. అందరిలో ఎన్నో రకాల ఆలోచనలు. ఇప్పటివరకు రాజమౌళి తన సినిమాల్లో హీరోలని మాస్ గా రఫ్ గా చూపించారు. అంతేకాదు రాజమౌళి సినిమా అంటే మట్టిలో కొట్టుకోవాలి, గ్రౌండ్ లో క్రికెట్ ఆడాలి, దుమ్ములో పోరాడాలి. కానీ మహేష్ ఇదంతా చెయ్యగలరా, మొండిగా కష్టపడగలరా. అసలే మహేష్ సుకుమారంగా, హ్యాండ్ సమ్ గా కనబడతారు.. రాజమౌళి తో సినిమా అంటే పెద్ద టాస్కె అంటూ ఏవేవో ఊహించుకున్నారు.

అవన్నీ పక్కనబెడితే రాజమౌళి తో చెయ్యబోయే SSMB29 కోసం మహేష్ బాబు మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. ఇప్పటికే మహేష్ జర్మనీ వెళ్లొచ్చారు. లుక్ కి సంబందించిన కొన్ని సూచనల కోసం ఆయన అక్కడికి వెళారట. రాజమౌళి కూడా SSMB29 స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారు. ఈలోపు మహేష్ ఫిట్ నెస్ కోసం తెగ వర్కౌట్స్ చేస్తున్నారు. అయితే రాజమౌళి మహేష్ లుక్ కోసం ఏకంగా నెలరోజులు కేటాయించారనే న్యూస్ సోషల్ మీడియాలో చూడగానే నెటిజెన్స్ సరదాగా.. పాపం రాజమౌళి మహేష్ లుక్ కోసం తెగ కష్టపడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌హేష్ లుక్ కోసం స్కెచ్ ఆర్టిస్టుల‌తో ఏడెనిమిది ర‌కాల గెట‌ప్పులు సిద్ధం చేశారని వినికిడి. ఆ ఎనిమిది రకాల లుక్స్ లో మ‌హేష్ ఎలా ఉంటారు, కెమెరా ముందు మహేష్ లుక్స్ కి సంబంధించి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండ‌బోతోంది, ఏ లుక్ మహేష్ కి సెట్ అవుతుంది అనే చర్చల్లో రాజమౌళి టీమ్ ఉందట. దాదాపు నెలరోజుల పాటు ఈ లుక్ టెస్ట్ ఉండబోతుంది. ఈ నెల రోజుల పాటు మహేష్ 8 ర‌కాల లుక్స్‌ని ప‌రిశీలించి.. చివ‌రికి ఒక లుక్ ఫైన‌ల్ చెయ్యడానికి రాజ‌మౌళి అంత‌ర్జాతీయ నిపుణుల్ని రంగంలోకి దించ‌నున్నారని తెలుస్తోంది. 

Rajamouli struggles for Mahesh look:

Mahesh Babu undergoes various look tests for SS Rajamouli

Tags:   MAHESH BABU U
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ