ఈమధ్యన సోషల్ మీడియాలో హీరోయిన్ నివేదా పేతురాజ్ పై కొన్ని రకాల వార్తలు హైలెట్ అయ్యాయి. నివేదా పేతురాజ్ కి తమిళ సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ బోలెడన్ని ఖరీదైన గిఫ్ట్ లు పంపించాడని, ఆమె ఆ గిఫ్ట్ లతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది, ఆ డబ్బుతోనే నివేదా పేతురాజ్, ఆమె కుటుంభం దుబాయ్ లో జల్సాలు చేస్తుంది అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరి ఇలాంటి వార్తలు చూస్తే వారికైనా కోపమే వస్తుంది. అదే లెక్కన నివేదా పేతురాజ్ కూడా తనపై వస్తున్న సారి రూమర్స్ పై ఫైర్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా నివేదా పేతురాజ్ ఈ రూమర్స్ పై గట్టిగా ఇచ్చిపడేసింది. ఈమధ్యన నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు అంటూ తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నేను ఇలాంటి రూమర్స్ ని పట్టించుకోకుండా సైలెంట్ గా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం అయ్యేముందు, అసలు ఆ సమాచారం నిజమా, కాదా అని చెక్ చేసుకుంటారని నేను అనుకున్నాను. ఇలాంటి వార్తలతో నేను, నా కుటుంబం గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం.
తప్పుడు రాతలు రాసే ముందు కాస్త ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నేను 16 సంవత్సరాల నుండే నా కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నాను, ఆర్ధికంగా బాగానే ఉన్నాను. నా ఫ్యామిలీ ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉంది. 20 ఏళ్లకు పైగా మేము దుబాయ్‌లోనే ఉంటున్నాం. సినిమాల్లో నాకు అవకాశం ఇప్పించమని ఇండస్ట్రీలో నేను ఏ నిర్మాతను గానీ, డైరెక్టర్ ని, హీరోని గానీ అడగలేదు. నేను డబ్బు కోసం అత్యాశ పడను. మేము ఇప్పటికీ దుబాయ్ లో అద్దె ఇంట్లోనే ఉంటున్నాము. నాకు రేసింగ్ అంటే ఫ్యాషన్. నాకు చెన్నైలో రేసింగ్ జరుగుతున్న విషయం తెలియదు. నా గురించి ఇప్పటి వరకూ వచ్చిన వార్తలు అన్ని అబద్దాలే అని నేను నమ్మకంగా చెప్పగలను.
నేను మీ ఇంట్లో ఆడవాళ్లలా ప్రశాంతమైన, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. దయ చేసి ఒకరిపై రూమర్స్ రాసే ముందు అన్ని నిజాలను తెలుసుకుని రాయండి అంటూ నివేద పేతురేజ్ ఫైర్ అవుతుంది.