యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీలోకి ఎంట్రీ ఇచ్చే తరుణం ఆసన్నమైంది. ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ తో కలిసి బాలీవుడ్ బాక్సాఫీసుని చెడుగుడు ఆడిన ఎన్టీఆర్ ఇప్పుడు నేరుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొరటాల శివ తో చేస్తున్న దేవర షూటింగ్ ఆల్మోస్ట్ చివరి స్టేజి కి చేరుకుంది. దేవర షూటింగ్ ముగించేసి ఎన్టీఆర్ ఇకపై బాలీవుడ్ కి వెళ్ళిపోతారు. హృతిక్ రోషన్ హీరోగా ఆయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 లో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
లేటెస్ట్ గా వార్ 2 పై ఓ సాలిడ్ అప్డేట్ బయటికి వచ్చింది. మార్చ్ 7 నుంచి వార్ 2 సెట్స్ మీదకి వెళ్లబోతుంది. దీనికి సంబందించిన అప్ డేట్ హృతిక్ ఎప్పుడో ఇవ్వగా.. తాజా సమాచారం ప్రకారం వార్ 2 లో ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి ఎగ్జైటింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రని దర్శకుడు ఆయన్ చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తున్నారట.
యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఏజెంట్స్ తరహాలోనే ఎన్టీఆర్ పాత్ర కూడా ఓ ఇండియన్ ఏజెంట్ గా కనిపించనున్నదని, ఆయన్ ముఖర్జీ ఎన్టీఆర్ కోసం సెపరేట్ ట్రాక్ ని ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఇంతకుముందు వార్ 2 లో ఎన్టీఆర్ విలన్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో కనిపిస్తాడనే ప్రచారం జరిగినా.. ఇప్పుడు మాత్రం ఈ చిత్రంలో ఎన్టీఆర్ విలన్ కాదని హృతిక్ తో కలిసి విలన్ ని ఎదుర్కొనే సమాన పాత్రలో కనిపిస్తాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ కేటాయించింది అతి తక్కువ డేట్స్ అయినప్పటికీ.. ఎన్టీఆర్ 30 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.