Advertisementt

ప్రభాస్ తో దిశా పటాని రొమాంటిక్ సాంగ్

Tue 05th Mar 2024 05:44 PM
prabhas  ప్రభాస్ తో దిశా పటాని రొమాంటిక్ సాంగ్
Disha Patani romantic song with Prabhas ప్రభాస్ తో దిశా పటాని రొమాంటిక్ సాంగ్
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మహానటి దర్శకుడు తెరకెక్కిస్తున్న కల్కి 2898 AD చిత్రంపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. మే 9 న కల్కి రిలీజ్ అంటూ మేకర్స్ చెప్పినప్పటినుంచి ప్రభాస్ ఫాన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈమధ్యన కల్కి మే 9 నుంచి పోస్ట్ పోన్ అవ్వుద్ది అనే వార్తలకి మేకర్స్ చెక్ చెప్పారు. ఈ చిత్రంలో ప్రభాస్ తో దీపికా పదుకొనె, దిశా పఠానీలు రొమాన్స్ చేస్తున్నారు. అమితాబ్, కమల్ హాసన్ లు కల్కి లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ప్రస్తుతం కల్కి 2898 AD చిత్రం షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. ఇటలీలో సార్దీనియా ద్వీపంలో ప్రభాస్ - దిశా పటాని లపై నాగ్ అశ్విన్ రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. సార్దీనియా ద్వీపంలోని అద్భుతమైన లొకేషన్స్ లో, బీచ్ ఒడ్డున ప్రభాస్-దిశలపై ఈ పాటని చిత్రీకరిస్తున్నారట. ఈ పాట సినిమా హైలెట్స్ లో ఒకటిగా నిలుస్తుంది అంటున్నారు.

కల్కి కథ గతంలో అంటే మహాభారతం కాలంలో మొదలై 2898 కి ముగుస్తుంది అందుకే ఈ చిత్రానికి కల్కి 2898 AD టైటిల్ పెట్టినట్లుగా నాగ్ అశ్విన్ రీసెంట్ గానే రివీల్ చేసారు. 

Disha Patani romantic song with Prabhas:

Kalki 2098 AD: Romantic Song With Prabhas Disha Patani Shooting In Italy

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ