అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో ప్యాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతున్న పుష్ప ద రూల్ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతుంది. ఆగష్టు 15 నుంచి ఎట్టి పరిస్తితుల్లో తప్పుకోకూడదనే కసితో చిత్ర బృందం పని చేస్తోంది. పుష్ప పార్ట్ 1 తో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ పై విపరీతంగా ప్రెజర్ పెరిగింది. పుష్ప 2 తో పక్కాగా హిట్ కొట్టాల్సిందే. అందుకే పుష్ప 1 కన్నా పుష్ప ద రూల్ కోసం ఎక్కువగా కష్టపడుతున్నాడట.
ప్రస్తుతం సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో స్పషల్ గా వేసిన సెట్ లో జరుగుతుంది. సుకుమార్ అల్లు అర్జున్ తో పాటు కొంత మంది డాన్సర్స్ పై పాట చిత్రీకరణ చేపట్టారట. ఒకటి రెండు రోజుల్లో పాట చిత్రీకరణ పూర్తి అవ్వబోతుంది అని సమాచారం. మహాశివరాత్రి అవ్వగానే పుష్ప 2 యూనిట్ మొత్తం కొత్త షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ రష్మిక జాయిన్ అవుతుందట. అక్కడ వైజాగ్ లో పుష్ప రాజ్-శ్రీవల్లి లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట.
అంతేకాకుండా అదే షెడ్యూల్ లో అల్లు అర్జున్-రష్మిక లపై ఓ పాట చిత్రీకరణ కూడా చేపడతారట. మరి చకచకా పుష్ప 2 షూటింగ్ ముగించేది పోస్ట్ ప్రొడక్షన్ ని వెళ్లాలని సుకుమార్ డే అండ్ నైట్ కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.