ఈ వారం మహాశివరాత్రి స్పెషల్ గా ఏయే చిత్రాలు థియేటర్స్ లోకి వస్తున్నాయో, ఏయే చిత్రాలు, వెబ్ సీరీస్ లు ఓటిటిలోకి వస్తున్నాయో చూసేద్దాం. మార్చ్ 8 మహా శివరాత్రి రోజున గోపీచంద్-హర్ష కాంబోలో ఫాంటసీ యాక్షన్ డ్రామా ఫిల్మ్ గా తెరకెక్కిన భీమా, విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన గామి, మలయాళ చిత్రం తెలుగులో ప్రేమలు గా డబ్బింగ్ అవడంతో పాటుగా, రికార్డ్ బ్రేక్, వి లవ్ బ్యాడ్ బాయ్స్, రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి వంటి చిన్న చిత్రాలు కూడా థియేటర్స్ లో విడుదలకు కి రెడీ అయ్యాయి. ఇక ఓటీటీలలో ఈ వారం సందడి చేసే సినిమాలు, వెబ్ సీరీస్ లు ఏమిటో చూసేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు లిస్ట్
అమెజాన్ ప్రైమ్ వీడియో :
సాగు (తెలుగు): మార్చి 4
కెప్టెన్ మిల్లర్ (హిందీ): మార్చి 8
నెట్‌ఫ్లిక్స్ :
అన్వేషిప్పిన్ కండెతుమ్ (తెలుగులోనూ): మార్చి 8
డిస్నీ+ హాట్‌స్టార్ :
షో టైమ్ (హిందీ): మార్చి 8
సోనీలివ్ :
మహారాణి (హిందీ వెబ్‌సిరీస్): మార్చి 7