Advertisementt

బెయిల్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్న క్రిష్

Mon 04th Mar 2024 06:12 PM
krish  బెయిల్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్న క్రిష్
Drugs Case: Director Krish Tests Negative బెయిల్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్న క్రిష్
Advertisement
Ads by CJ

గత వారం రాడిసన్ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ పేరు హైలెట్ అవడంతో సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలోనూ కొంతమంది ప్రముఖుల పేర్లు ఇలాంటి డ్రగ్స్ కేసులో వినిపించాయి. ఇప్పుడు దర్శకుడు క్రిష్, అలాగే ఓ నిర్మాత కొడుకు పేర్లు బయటికి రాగా.. ముందు క్రిష్ ఈ కేసుతో తనకి ఏ సంబందం లేదు అని చెప్పి ముంబై వెళ్లి తనని అరెస్ట్ చెయ్యకుండా బెయిల్ కోసం హై కోర్టులో పిటిషన్ వెయ్యడంతో అందరిలో అనుమానాలు రేకెత్తాయి.

అయితే కోర్టు కేసు ఈరోజు సోమవారానికి వాయిదా పడడంతో క్రిష్ చేసేది లేక సైలెంట్ గా శుక్రవారం నార్కోటిక్ పోలిసుల ఎదుట విచారణకి హాజరవగా.. కొద్దిసేపు పోలీసులు క్రిష్ ని విచారించి అతని బ్లడ్, మూత్ర నమూనానని సేకరించి పంపేశారు. అయితే రక్త, మూత్ర నమూనాలో నెగెటివ్ రిపోర్ట్స్ రావడంతో క్రిష్ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ ని విత్ డ్రా చేసుకున్నట్టుగా ఆయన తరపు లాయర్ చెప్పారు.

రక్త, మూత్ర నమోనాల్లో క్రిష్ డ్రగ్స్ తీసుకోలేదని తేలడంతో క్రిష్ తరపు న్యాయవాది ఈ పిటిషన్ ని వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం క్రిష్ అనుష్క తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నాడు.

Drugs Case: Director Krish Tests Negative:

Krish has withdrawn the anticipatory bail petition 

Tags:   KRISH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ