Advertisementt

పుష్ప 2 లోకి బాలీవుడ్ క్రేజీ నటుడు

Mon 04th Mar 2024 03:46 PM
sanjay dutt  పుష్ప 2 లోకి బాలీవుడ్ క్రేజీ నటుడు
Top Bollywood Actor To Join Pushpa 2? పుష్ప 2 లోకి బాలీవుడ్ క్రేజీ నటుడు
Advertisement
Ads by CJ

సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో క్రేజీ ప్యాన్ ఇండియా ఫిలిం పుష్ప కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. రోజూ ఒకటి రెండు యూనిట్స్ పుష్ప చిత్రీకరణలో పాల్గొంటున్నట్లుగా సమాచారం. ఆగస్టు 15 టార్గెట్ గా పుష్ప 2 యూనిట్ కష్టపడుతుంది. రష్మిక మందన్న కూడా అటు ధనుష్ మూవీ ఇటు పుష్ప 2 షూటింగ్స్ తో బిజీ బిజీగా కనబడుతుంది.

నార్త్ లో పుష్ప అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవడంతో పుష్ప 2 లోకి కొంతమంది బాలీవుడ్ నటులని సుకుమార్ తీసుకుంటున్నారు అన్నప్పటికీ.. ఆ విషయమై ఇంతవరకు క్లారిటీ లేదు. తాజాగా బాలీవుడ్ నటుడు, ప్యాన్ ఇండియా యాక్టర్ సంజయ్ దత్ పుష్ప2 లో భాగం కాబోతున్నాడనే న్యూస్ వినిపిస్తోంది. సంజయ్ దత్ కోసం పుష్ప2 లో ఓ కీలక పాత్రను ప్లాన్ చేశారని.. ఈ చిత్రంలో సంజయ్ దత్ డాన్ గా కనిపిస్తాడంటూ సోషల్ మీడియా టాక్.

ఇంతకుముందు కూడా చాలా స్టార్స్ పేర్లు ప్రచారంలోకి వచ్చినా.. వాటిపై చిత్ర బృందం ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. అందుకే సంజయ్ దత్ కేరెక్టర్ పై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. 

Top Bollywood Actor To Join Pushpa 2?:

Sanjay dutt To Share Screen With Allu Arjun In Pushpa 2?

Tags:   SANJAY DUTT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ